Isudan Gadhvi: గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థిగా ఇసుదన్ గాధ్వి!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే.
- Author : Gopichand
Date : 04-11-2022 - 7:09 IST
Published By : Hashtagu Telugu Desk
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో తమ పార్టీ తరపున పోటీపడే సీఎం అభ్యర్థిని ఆప్ ప్రకటించింది. ఆప్ జాతీయ కార్యదర్శి ఇసుదన్ గాధ్విని గుజరాత్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్రం ఎన్నికల సంఘం గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ ఒకటో తేదీన తొలి దఫా, అయిదవ తేదీన రెండో దఫా ఎన్నికలను నిర్వహించనున్నారు. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తొలి విడుతలో 89 స్థానాలకు, రెండవ విడుతలో 93 స్థానాలకు పోలింగ్ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు.