Rahul Gandhi: రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఐదు రోజుల పాటు విరామం
- By Latha Suma Published Date - 11:55 AM, Wed - 21 February 24

Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)కు బ్రేక్ పడింది. రాహుల్ గాంధీ పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్న నేపథ్యంలో యాత్రకు ఐదు రోజుల పాటు విరామం ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకూ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈనెల 27, 28 తేదీల్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం (Cambridge University)లో ప్రసంగించనున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు దేశంలో త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలో పలు ముఖ్య సమావేశాల్లో కూడా రాహుల్ పాల్గొనాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే యాత్రకు ఐదు రోజుల పాటు తాత్కాలిక బ్రేక్ ఇచ్చినట్లు తెలిపారు. యాత్రను మార్చి 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ధోల్‌పూర్‌లో తిరిగి పునఃప్రారంభిస్తామని వెల్లడించారు. ఇక మార్చి 5వ తేదీన ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని రాహుల్ సందర్శిస్తారని జైరాం రమేశ్ ఈ సందర్భంగా తెలిపారు.
read also : Bus Accident : మేడారం వెళ్తోన్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు