Anil Antony joins BJP: బీజేపీలో చేరిన ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోనీ
- By hashtagu Published Date - 04:37 PM, Thu - 6 April 23

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ (Anil Antony joins BJP) బీజేపీలో చేరారు. బీబీసీ వివాదం తర్వాత తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన అనిల్ కాంగ్రెస్‌తో విభేదాల తర్వాత పార్టీని వీడారు.అనిల్ ఆంటోనీని కేరళ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ ఈరోజు బీజేపీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) సోషల్ మీడియా కోఆర్డినేటర్ పదవికి అనిల్ ఆంటోనీ రాజీనామా చేశారు. ప్రధాని మోదీ, గుజరాత్ అల్లర్లపై తీసిన వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీపై ఆయన ట్వీట్ చేయడంతో పార్టీలో వివాదం నెలకొంది.
అనిల్ ఆంటోనీని ఈరోజు బీజేపీ నేతలు పీయూష్ గోయల్, వీ మురళీధరన్, పార్టీ కేరళ యూనిట్ చీఫ్ కే సురేంద్రన్ లాంఛనంగా పార్టీలోకి ఆహ్వానించారు. సభ్యత్వం తీసుకున్న అనంతరం అనిల్ ఆంటోని విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తాను కుటుంబం కోసం పనిచేస్తున్నానని నమ్ముతానని, అయితే నేను కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నానని నమ్ముతానని.. ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషి నన్ను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. కాంగ్రెస్ నేత శశిథరూర్‌కి అనిల్ చాలా సన్నిహితంగా ఉంటుండేవారు. తన రాజీనామా లేఖలో కూడా థరూర్‌కు ధన్యవాదాలు తెలిపారు.