HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >All Party Meeting Revanth Reddy Ktr On The Same Platform

Delimitation : అఖిలపక్ష భేటీ.. ఒకే వేదికపై రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌

ఈ సమావేశంలో డీలిమిటేషన్‌ ప్రభావంపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని ఎండగట్టి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు.

  • Author : Latha Suma Date : 22-03-2025 - 12:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
All-party meeting.. Revanth Reddy, KTR on the same platform
All-party meeting.. Revanth Reddy, KTR on the same platform

Delimitation : సీఎం ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన చెన్నైలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై చర్చించేందుకు తమిళనాడులోని అధికారపక్షం డీఎంకే శనివారం దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం ఏర్పాటైంది. ఈ సదస్సుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో డీలిమిటేషన్‌ ప్రభావంపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని ఎండగట్టి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు.

Read Also: PM Modi: శ్రీలంక పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పుడంటే? 

ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ.. జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆరోపించారు. సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల కోసం మనం పోరాటం చేయాల్సి వస్తుంది. మన సమ్మతితో సంబంధం లేకుండానే చట్టాలు రూపొందుతాయి. ఆ నిర్ణయాలు మన ప్రజలపై ప్రభావం చూపుతాయి. విద్యార్థులు అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. రైతులకు మద్దతు కొరవడుతుంది. మన సంప్రదాయాలు, వృద్ధి ప్రమాదంలో పడతాయి. సామాజిక న్యాయం దెబ్బతింటుంది. ఈ పరిణామాలన్నింటితో మన సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతాం అని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు.

డీలిమిటేషన్‌పై ఈ అఖిలపక్ష భేటీ చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది. ప్రస్తుతమున్న జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదు. దీన్ని మనమంతా వ్యతిరేకించాలి. పార్లమెంట్‌లో మన ప్రాతినిధ్యం పడిపోతే.. అభిప్రాయాలను వ్యక్తీకరించే బలం తగ్గుతుంది. తమ నిరసన పునర్విభజనకు వ్యతిరేకంగా కాదని స్టాలిన్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. న్యాయబద్ధంగా, పారదర్శంగా డీలిమిటేషన్‌ చేయాలనే తాము డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇక, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ.. జనాభా నియంత్రణపై మన చర్యలకు ఎలాంటి రివార్డ్‌ లభించలేదు సరికదా.. ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదంలో పడ్డాం అని అన్నారు. జనాభా పెరుగుదలను అరికట్టేందుకు కొన్ని దశాబ్దాలుగా పలు దక్షిణాది రాష్ట్రాలు కీలక చర్యలు చేపడుతున్నాయి. ఇందుకోసం అనేక విధానాలు కూడా తీసుకొచ్చాం. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం జనాభా వృద్ధి విపరీతంగా ఉందన్నారు.

Read Also: Bird flu : మళ్లీ విజృంభించిన బర్డ్ ఫ్లూ..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • all party meeting
  • CM MK Stalin
  • CM Revanth Reddy
  • Delimitation
  • ktr
  • Southern States
  • tamil nadu

Related News

Lokesh vs. Chidambaram: Heated Row Over Delimitation Erupts on X

Political Debate: లోకేష్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై ఎక్స్ వేదికగా రచ్చ

లోక్‌సభ స్థానాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశమైంది. ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ‘ది హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కౌంటర్‌.. లోకేశ్‌ అంతే ఘాటుగా రీకౌంటర్ ఇవ్వడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. లోకేశ్‌ ఏమన్నారు? ‘ది హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేశ్‌ కేంద

  • Tvk Vijay Ntr

    Cm Vijay: తమిళనాడు సీఎం విజయ్‌ మార్క్ పాలన ఇదే

  • Vijay TVK

    Cm Vijay: ఆరు నెలల్లో విజయ్ ప్రభుత్వం కూలిపోతది.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  • Good News for the People of Telangana: New Pensions—Starting From When?

    New Pensions: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కొత్త పెన్షన్లు.. ఎప్పటి నుంచంటే..?

Latest News

  • Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

  • PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..

  • Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

  • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

Trending News

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd