ADR Report : బీజేపీకి కార్పొరేట్ విరాళాల పంట, 80శాతం కషాయ ఖాతాలోకే.!
కార్పొరేట్ల నుంచి విరాళాలను పొందడంలో మోడీ, షా ఆధ్వర్యంలో బీజేపీ(ADR Report)రికార్డ్ కొట్టింది.
- By CS Rao Published Date - 06:10 PM, Thu - 16 February 23
కార్పొరేట్ల నుంచి విరాళాలను పొందడంలో మోడీ, షా ద్వయం ఆధ్వర్యంలో బీజేపీ(ADR Report) రికార్డ్ బద్దలు కొట్టింది. దేశంలోని జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాల్లో బీజేపీ(BJP) వాటా 80శాతంగా ఉందని ఏడీఆర్ రిపోర్ట్ ప్రకటించింది. గత ఆర్థిక ఏడాది (2021-22) దేశంలోని ఎనిమిది జాతీయ పార్టీలకు విరాళంగా 7వేలా 141కోట్లలో నిధులలో అధిక వాటా కమలం పార్టీకే దక్కడం కార్పొరేట్లకు ఆ పార్టీ వేస్తోన్న పెద్ద పీట ఏమిటో అర్థమవుతోంది. విరాళాల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది.
కార్పొరేట్ల నుంచి మోడీ, షా ద్వయం ఆధ్వర్యంలో బీజేపీ విరాళాలను (ADR Report)
రెండో స్థానంలో కాంగ్రెస్ రూ. 95 కోట్లను విరాళంగా పొందింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) రూ.58 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఎనిమిది జాతీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలలో కార్పొరేట్లు మరియు వ్యాపార సంస్థల నుంచి వచ్చిన రూ. 780 కోట్లలో రూ. 625 కోట్లు బీజేపీ(BJP) వాటాగా వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి బీజేపీకి రూ. 614.52 కోట్లు అందాయని, కాంగ్రెస్ రూ.95.45 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రూ.44.54 కోట్లు అందాయని తేల్చింది.
Also Read : AP Politics : MLC ఎన్నికల్లో ఎవరిదోవ వాళ్లదే! BJPకి JSP కటీఫ్,TDPకి మద్ధతు?
2021-22 ఆర్థిక సంవత్సరంలో జాతీయ రాజకీయ పార్టీలు స్వీకరించిన రూ. 20వేల కంటే ఎక్కువ మొత్తం విరాళాలను ఏడీఆర్(ADR Report) పరిగణనలోకి తీసుకుంది. ఎనిమిది జాతీయ పార్టీల డేటాను పరిశీలించింది: భారతీయ జనతా పార్టీ (బిజెపి), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్సి), బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPI(M)), ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC) మరియు నేషనల్ పీపుల్స్ పార్టీ (NPEP) లను విరాళాలను అధ్యయనం చేసింది. 2021-22 సంవత్సరంలో మొత్తం ఎనిమిది జాతీయ పార్టీలు మొత్తం 7,141 విరాళాలు అందుకున్నాయని, అందులో బీజేపీ రూ.780.7 కోట్లు వాటాగా పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 30% బీజేపీ విరాళం పెరిగింది గత ఏడాది 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేవలం 3,753 విరాళాల నుండి బీజేపీకి రూ. 593.7 కోట్లు వచ్చాయని పొందుపరిచింది.
బీజేపీ మినహా ఏడు జాతీయ పార్టీలు కార్పొరేట్ సంస్థల నుంచి రూ.77 కోట్లు(BJP)
2020-21 ఆర్థిక సంవత్సరానికి 2,206 విరాళాల మొత్తం నుంచి రూ. 477.5 కోట్లను బిజెపి(BJP) పొందింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,255 విరాళాల నుండి, కాంగ్రెస్ రూ. 95.4 కోట్ల నిధులను సేకరించింది. దాదాపు రూ.58 కోట్ల విలువైన విరాళాలు అందుకోవడం ద్వారా ఎన్సీపీ తర్వాతి స్థానంలో నిలిచింది. 2021-22లో బీజేపీకి విరాళాల రూపంలో వచ్చిన నిధులు ఆరు పార్టీలు – INC, NCP, CPI, CPI(M), NPEP మరియు AITCలు ప్రకటించిన మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ అని నివేదిక పేర్కొంది. సుమారు రూ. 548 కోట్ల కార్పొరేట్ విరాళాలలో బిజెపి వాటా, వ్యాపార సంస్థల నుండి ఇతర జాతీయ పార్టీలు అందుకున్న మొత్తం నిధుల కంటే ఏడు రెట్లు ఎక్కువ. బీజేపీ మినహా ఏడు జాతీయ పార్టీలు కార్పొరేట్ సంస్థల నుంచి ఏకంగా రూ.77 కోట్లు అందుకున్నాయి.
విరాళాలు కూడా అసంపూర్ణమైన చెక్కు లేదా DD వివరాలను..
ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ మొత్తం రూ.353 కోట్లలో బీజేపీ(BJP) రూ.336.5 కోట్లు, కాంగ్రెస్ రూ.16.50 కోట్లు మాత్రమే అందజేశాయి. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుండి బిజెపి తన నిధులలో సగానికి పైగా పొందింది. కాంగ్రెస్ అదే మూలం నుండి మొత్తం నిధులలో 17.28% పొందింది. 2021-22 సంవత్సరంలో 4,506 మంది వ్యక్తిగత దాతలు రూ. 153.328 కోట్లను (మొత్తం విరాళాలలో దాదాపు 20%) పార్టీలకు విరాళంగా ఇచ్చారు. BJP, INC మరియు CPI(M) 452 విరాళాల ప్రీమనెంట్ అకౌంట్ నంబర్ (PAN) వివరాలను ప్రకటించలేదని, దీని ద్వారా పార్టీలు మొత్తం రూ. 10.843 కోట్లను సేకరించాయని నివేదిక పేర్కొంది . ఐదు పార్టీలు ప్రకటించిన 1,500 కంటే ఎక్కువ విరాళాలు కూడా అసంపూర్ణమైన చెక్కు లేదా DD వివరాలను కలిగి ఉన్నాయి.
Also Read : BJP: ప్లీజ్ రండి! బీజేపీలో చేరండి.! తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ భిక్షాటన !!
Related News
Eelection Meetings : సభల సందడి! 23న కేసీఆర్, 25న ఖర్గే, 28న అమిత్ షా
తెలంగాణ రాష్ట్రం మీద కాంగ్రెస్, బీజేపీ (Eelection Meetings) కన్నేశాయి. 25న ఖర్గే, ఈనెల 28న అమిత్ షా ఖమ్మం కు ఏర్పాట్లు