Pahalgam Attack : లష్కరే ఉగ్రవాదితో బంగ్లా ప్రభుత్వ పెద్ద భేటీ.. మరో స్కెచ్ ?
భారత్‌లో పహల్గాం ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తైబా(Pahalgam Attack) ఉగ్రవాద సంస్థ నేత ఇజార్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వాలారు.
- By Pasha Published Date - 01:41 PM, Mon - 28 April 25

Pahalgam Attack : పాకిస్తాన్‌పై దాడి చేయడానికి ముందు.. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించాలని భారత్ భావిస్తోంది. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లోనే భారత నిఘా వర్గాలు, భద్రతా సంస్థలు బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ దిశగా ఫోకస్ పెట్టిన భారత్ చేతికి కీలక సమాచారం ఒకటి చిక్కింది. అది పాకిస్తాన్‌కు సంబంధించిన సమాచారం కాదు.. బంగ్లాదేశ్‌కు చెందినది. అదేమిటో చూద్దాం..
Also Read :Gold ATM : గోల్డ్ ఏటీఎం వచ్చేసింది.. ఫీచర్లు ఇవీ
బంగ్లా బార్డర్ నుంచి కూడా చొరబాట్లకు స్కెచ్ ?
ప్రస్తుతం బంగ్లాదేశ్ అధికార పీఠంపై ఉన్న తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా నడుచుకుంటోంది. పాకిస్తాన్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈక్రమంలోనే తాజాగా కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది. భారత్‌లో పహల్గాం ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తైబా(Pahalgam Attack) ఉగ్రవాద సంస్థ నేత ఇజార్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వాలారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలోని లీగల్ అడ్వైజర్ డాక్టర్ అసిఫ్ నజ్రుల్‌తో లష్కరే ఉగ్రవాది ఇజార్ సమావేశమయ్యాడు. దీనిపై జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కథనాలు కూడా ప్రచురితం అయ్యాయి. అంటే ఇది సీక్రెట్ సమావేశం కాదు. బహిరంగంగానే లష్కరే తైబా లాంటి ఉగ్రవాద సంస్థతో బంగ్లాదేశ్ ప్రభుత్వం పెద్దలు చేతులు కలిపారు. తద్వారా తమ బరితెగింపును యావత్ ప్రపంచానికి చూపించారు. బంగ్లాదేశ్ గడ్డ నుంచి ఉగ్రదాడులకు పాల్పడిన చరిత్ర ఇజార్‌కు ఉంది. అటువంటి వ్యక్తికి బంగ్లాదేశ్ ప్రభుత్వం, సైన్యం సహకారం లభిస్తే పరిస్థితులు అదుపుతప్పే ముప్పు ఉంటుంది. పర్యవసానంగా భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు మరింతగా దెబ్బతినే రిస్క్ ఉంటుంది. బంగ్లాదేశ్ బార్డర్ నుంచి కూడా ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు లష్కరే తైబా స్కెచ్ గీసిందా ? అందుకే అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందా ? అనే కోణంలో భారత సర్కారు ఆలోచించాల్సి అవసరం ఉంది.
Also Read :Turkish Warplanes: పాకిస్తాన్‌కు టర్కీ యుద్ధ విమానాలు.. ఎందుకు ?
బంగ్లాదేశ్‌కు ఇక గడ్డుకాలమే
అయితే ఈ అంశంపై బంగ్లాదేశ్‌కు చెందిన న్యూస్ ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ ‘రూమర్ స్కానర్’ భిన్నమైన కథనాన్ని పబ్లిష్ చేసింది. లష్కరే తైబా ఉగ్రవాది ఇజార్‌తో అసిఫ్ నజ్రుల్ భేటీ ఏప్రిల్ 21న జరిగిందని పేర్కొంది. ఏదిఏమైనప్పటికీ లష్కరే తైబా లాంటి ఉగ్రవాద సంస్థ నేతలతో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి లింకులు ఉండటం అనేది యావత్ ప్రపంచానికి ఆందోళన కలిగించే అంశం. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)’ సంస్థ.. లష్కరే తైబాకు అనుబందంగా పనిచేస్తోంది. లష్కరేతో లింకులు కలిగిన బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని భారత్ అస్సలు స్వాగతించదు. ఆ విధమైన లింకులను తెంచుకుంటే తప్ప బంగ్లాదేశ్‌తో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు అవకాశం ఉండకపోవచ్చని రాజకీయ పండితులు అంటున్నారు.