HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >80 Percent Approval For Modi What About The Opposition

Modi : మోదీకి 80 శాతం ఆమోదం.. మరి విపక్షాల మాటేమిటి?

G20 సమావేశం ముగిసిన తక్షణమే ప్రధాని మోదీ (PM Modi) సార్వత్రిక ఎన్నికల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

  • Author : Hashtag U Date : 31-08-2023 - 12:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
80 Percent Approval For Modi.. What About The Opposition
80 Percent Approval For Modi.. What About The Opposition

By: డా. ప్రసాదమూర్తి

Narendra Modi : జి20 శిఖరాగ్ర సమావేశానికి వేదికగా భారత దేశం సకల సన్నాహాలతో సర్వ సన్నద్ధంగా వుంది. ఈ సమావేశం ముగిసిన తక్షణమే ప్రధాని మోదీ సార్వత్రిక ఎన్నికల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే తరుణంలో దేశంలో ప్రధాని మోదీ (PM Modi) పట్ల 80 శాతం భారతీయులు సానుకూలంగా ఉన్నట్లు ఒక సర్వే సంస్థ వెల్లడించిన వార్త దేశమంతా మీడియా హెడ్ లైన్స్ లో ధగధగా మెరిసిపోతోంది. సరిగ్గా ఈ నేపథ్యంలోనే విపక్షాల కూటమి INDIA , ముంబైలో ఈ రోజు, రేపు భేటీ అవుతోంది. మరి విపక్షాలు ఎలా తాజా సర్వే విషయాన్ని తిప్పి కొడతాయి అన్నది సర్వత్రా ఉత్కంఠకు దారి తీసింది.

ఇప్పటికే పాట్నాలో తొలి సమావేశం నిర్వహించిన ప్రతిపక్షాలు, బెంగళూరులో కొంత తమ ఎజెండాలో ముందుకు కదిలి ప్రగతి సాధించినట్టు కనిపించినా, వారి కలయికలో అడ్డంకులను గుర్తించి తొలగించే పనిలో ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపించడంలేదు. అయితే ఈ ముంబై సమావేశంలో బీజెపీ వ్యతిరేక కూటమికి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాల పట్ల నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కూటమి లోగో ఆవిష్కరించడం, కూటమికి ఒక వ్యవస్థీకృత రూపాన్ని ఇవ్వడం, కో ఆర్డినేటర్లను ఎంపిక చేయడం, అలాగే INDIA కన్వీనర్ ని ఎంచుకోవడం అనేవి ఈ సమావేశంలో ప్రధాన అంశాలుగా చెప్తున్నారు.

ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ఈ సారి 28 పార్టీల ప్రతినిధులు పాల్గొంటున్నట్టు చెప్తున్నారు. తొలి రోజు అంటే గురువారం నాడు ఫార్మల్ మీటింగ్ ఉంటుందని, శుక్రవారం నాడు మిగిలిన ఎజెండాలోని అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. సీట్ల ఒప్పందం లాంటి అనేక విషయాల మీద పార్టీల మధ్య తలెత్తే సమస్యలను, వైరుధ్యాలను పరిష్కరించుకోవడానికి వివిధ కమీటీలను ఏర్పాటు చేస్తారు.

నితీష్ కుమార్, రాహుల్ గాంధి, లాలూప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్ తదితర హేమాహేమీలు ముంబై చేరుకున్నారు. ఎజెండా ఏమైనప్పటికీ రకరకాల భావజాలాలు, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల ఆశలూ ఆకాంక్షలతో ఉన్న ఇన్ని పార్టీలు ఒక్కటై కడకంటూ కొనసాగుతాయా అన్నదే అతి పెద్ద చర్చనీయాంశంగా కనిపిస్తోంది. ఇప్పటికీ బిఎస్పీ నేత మాయావతి ఈ కూటమిలో చేరడానికి సుముఖత ప్రదర్శించలేదు. ఆమె బీజేపీతో చర్చలు కొనసాగిస్తున్న వార్తలు వినవస్తున్నాయి. బీజేపీతో తన సర్దుబాటు వీలుకాకపోతే, INDIA కూటమి తన డిమాండ్లకు తలొగ్గితే అప్పుడు మాయావతి ఈ బృందంలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో పక్క రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఎస్పీ నేత అఖిలేష్ కూడా మధ్యప్రదేశ్ లో పోటీకి దిగుతున్నట్టు వార్తలు వినవస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ కీలకంగా ఉన్న కూటమి ముందుకు ఎలా సాగుగతుందన్నదే ప్రతిపక్షాల ముందున్న పెను సవాలు.

అయితే ప్రతిపక్షాలు మాత్రం ధీమాగా ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి 22 కోట్ల ఓట్లు వచ్చాయని, ప్రతిపక్షాలకు అన్నింటకి కలిపి 23 కోట్ల 40 లక్షల ఓట్లు పోలయ్యాయని, విడివిడిగా పోటీ చేస్తేనే ఇలా వుంటే, కలిసి అంతా పోటీలో దిగితే తమ బలం మరింత పెరుగుతుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. పోతే ప్రధాని అభ్యర్ధి ఎవరన్నది ప్రతిపక్షాలు ఇంకా తేల్చుకోలేదని, ఇంక వారేం మోదీని (Modi) ఎదుర్కోగలరని బీజేపీవారు ఎదురు దాడి చేస్తున్నారు. దీనికి సమాధానంగా విపక్షాలు బీజేపీకి మోదీ తప్ప మరో వికల్పం లేదని, విపక్షాల వద్ద అనేక పత్యామ్నాయాలున్నాయని వాదిస్తున్నాయి. సిలెండర్ల రేటు తగ్గించి మోదీ (Modi) దేశంలోని అక్కచెల్లెళ్ళకు రాఖీ కానుక ఇచ్చారని బీజేపీ వారంటే, తాము ఏకంగా భారత మాత రక్షకులం అని విపక్షాలు అంటున్నాయి.

వాదోపవాదాల మాట ఎలా ఉన్నా ముంబై సమావేశం విపక్షాల ఐక్యతకు ఒక పెద్ద కొలమానం కాగలదని అందరూ ఊహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 12 సోషలిస్టు సంస్ధలు, ఎన్జీవోలతో కూడిన సోషలిస్టు జనతా పరివార్ ఈ విపక్ష కూటమికి మద్దతు తెలుపుతున్నట్టు తాజా వార్త వెలువడింది. కేంద్రంలోని ఫాసిస్టు,కమ్యునల్ ప్రభుత్వాన్ని దింపడానికి ఈ కలయిక అనివార్యం అని జేడీయూ నాయకుడు,మహారాష్ట్ర ఎమ్మెల్సీ కపిల్ పాటిల్ అన్నారు. తమ కూటమికి మహారాష్ట్రలో దాదాపు ఏడు శాతం ఓటింగ్ వుందని తాము కలిస్తే రాష్ట్రంలో విపక్షం బలోపేతమవుతుందని ఆయన వాదన. ఇలా ఒకవైపు విపక్షాల కూటమి రానురాను బలం పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది. అయితే కీలకమైన అంశాలు, సీట్ల షేరింగ్, ప్రధాని అభ్యర్థి విషయాలలో ఎలా ఈ కూటమి ఒక నిర్ణయానికి వచ్చి అది సర్వసమ్మతంగా మార్చి, ముందుకు సాగుతుందో వేచి చూడాలి.

Also Read:  Putin : రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ తప్పు చేస్తాడా..? చేస్తే అంతే సంగతి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Approval
  • bjp
  • india
  • narendra modi
  • opposition
  • pm modi

Related News

Cigarette Price Hike

ధూమపాన ప్రియులకు షాక్..

Itc Hikes Cigarette Prices  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. గతేడాది సెప్టెంబరులో జీఎస్టీ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ చాలా ఉత్పత్తులు, వస్తువులపై జీఎస్టీ తగ్గించగా.. వాటి ధరలు దిగొచ్చాయి. ఇదే సమయంలో పొగాకు, సిగరెట్ వంటి వాటిపై జీఎస్టీని 40 శాతానికి పెంచి.. అదనంగా ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా సిగరెట్ ధరలు భారీగా

  • Vijay Mallya

    Vijay Mallya: ‘ఇండియా కు రానంటే రాను’ – బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

  • Sundar Pichai

    ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

  • Indian Money

    Money Transaction : దేశంలో భారీగా చేతులు మారుతున్న డబ్బు

  • UPI One World

    విదేశీ అతిథుల కోసం ‘UPI One World’ సేవలు ప్రారంభం!

Latest News

  • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

  • పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

  • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

Trending News

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd