Rain : హైదరాబాద్ లో మరోసారి దంచికొట్టిన వర్షం..
సుమారు అరగంటకు పైగా దారి కూడా కనిపించనంత స్థాయిలో వర్షం కురిసింది
- By Sudheer Published Date - 06:16 PM, Sun - 10 September 23

గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి భారీ వర్షం (Hyderabad Heavy Rain) కురుస్తుంది. సుమారు అరగంటకు పైగా దారి కూడా కనిపించనంత స్థాయిలో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో నగరంలోని రోడ్లన్ని జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మరోసారి వణికిపోయాయి. రోడ్లు కనిపించనంతగా వర్షం కురియటంతో.. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సెలవు దినం అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో.. రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్, సోమాజిగూడ, అమీర్‌పేట, సనత్‌నగర్, సికింద్రాబాద్, బేగంపేట, చిలగూడ, బోయినపల్లి, అడ్డగుట్ట, ప్యారడైజ్, ప్యాట్నీ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్నది. తార్నాక, నాచారం, ఉప్పల్, మేడిపల్లి, నాంపల్లి, ఆబిడ్స్, కోఠి, అఫ్జల్‌గంజ్, ఖైరతాబాద్, అంబర్‌పేట, నల్లకుంట, కాచిగూడ, గోషామహల్, మలక్‌పేట, చాదర్‌ఘాట్ వాన కురుస్తున్నది. మరో రెండు , మూడు రోజుల పాటు తెలంగాణ లో భారీ నుండి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Read Also : G20 Sammit: ముగిసిన జీ20 సదస్సు.. ప్రధానిపై రాజ్ నాథ్ ప్రశంసలు
సోమవారం నుంచి బుధవారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు అక్కడక్కడ భారీ వర్షాలుపడుతాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.