G20 Sammit: జీ20 సమిట్ ప్రాంగణంలో వర్షపు నీరు
ఢిల్లీలో జీ20 సదస్సు జరుగుతున్న ప్రగతి మైదాన్‌లోని ప్రవేశద్వారం వరదలు ఏరులైపారుతున్నాయి. రాజధాని ఢిల్లీలో తెల్లవారుజామున మోస్తరు వర్షాలు పడ్డాయి
- Author : Praveen Aluthuru
Date : 10-09-2023 - 3:26 IST
Published By : Hashtagu Telugu Desk
G20 Sammit: ఢిల్లీలో జీ20 సదస్సు జరుగుతున్న ప్రగతి మైదాన్‌లోని ప్రవేశద్వారం వద్ద వరదలు ఏరులైపారుతున్నాయి. రాజధాని ఢిల్లీలో తెల్లవారుజామున మోస్తరు వర్షాలు పడ్డాయి. ఫలితంగా జీ20 సమ్మిట్ జరిగే ప్రాంగణం వరదలతో ముంచెత్తింది. ప్రతిష్టాత్మక సమావేశం జరుగుతున్న సమీపంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీపై కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తుంది. సదస్సు కోసం కోట్లు ఖర్చు చేసినట్టు కాంగ్రెస్ తెలిపింది. మరో కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. G20 సమ్మిట్ కోసం ఖర్చు చేసిన జీ20 నిధుల్లో మోదీ ప్రభుత్వం ఎంత దుర్వినియోగం చేసిందో అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈరోజు G20 అతిథులందరికీ వాటర్ స్పోర్ట్స్ డే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
కాగా 30 మందికి పైగా దేశాధినేతలు, యూరోపియన్ యూనియన్ మరియు ఆహ్వానిత దేశాలకు చెందిన ఉన్నతాధికారులు మరియు 14 మంది అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యే మెగా ఈవెంట్ కోసం పౌర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం నుండి భద్రత వరకు విస్తృతమైన సన్నాహాలు చేపట్టారు.
https://twitter.com/i/status/1700724259818201319
Also Read: Chandrababu Case : ఏసీబీ కోర్ట్ లో ముగిసిన వాదనలు