HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >You Can Make Fresh Paneer At Home With A Few Simple Tips

కొన్ని చిట్కాలతో ఇంట్లోనే స్వచ్ఛమైన పన్నీర్ చేసుకోవచ్చు..

  • Author : Vamsi Chowdary Korata Date : 14-01-2026 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Paneer
Paneer

పాలు, పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో పనీర్ ఒకటి. ముఖ్యంగా శాఖాహారులు పనీర్ వంటకాల్ని ఇష్టపడతారు. పనీర్ పాలతో తయారు చేయబడుతుంది, కాబట్టి ఇందులో దాదాపు అన్ని అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, మెగ్నీషియం, సెలీనియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.

పనీర్‌ని చాలా మంది ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ తినని వారికి పనీర్ మంచి ఆప్షన్. పనీర్ ఫ్రై, పనీర్ టిక్కా, పనీర్ మసాలా, పాలక్ పనీర్, పనీర్ 65 ఇలా రకరకాల వెరైటీలు చేసుకోవచ్చు. ఇంట్లో కూడా పనీర్ బిర్యానీని చాలా మంది చేసుకుని ఇష్టంగా తింటారు. పనీర్‌తో ఏదైనా వంటకం చేయాలనుకున్నప్పుడు చాలా మంది బయట మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు. అయితే, ఈ రోజుల్లో పనీర్ కల్తీ అవ్వడం మనం వార్తల్లోనే చూస్తూనే ఉన్నాం.

కల్తీ జరిగిన పనీర్ తినడం వల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. మార్కెట్ నుంచి వచ్చే కల్తీ పనీర్ తినకుండా ఉండాలంటే.. ఇంట్లోనే స్వచ్చమైన, మృదువైన పనీర్ తయారు చేసుకోవచ్చు. పనీర్ చేయడానికి పాలు విరిగిపోవడానికి చాలా మంది నిమ్మకాయ వాడుతుంటారు. అయితే, దీని వల్ల పనీర్ మృదువుగా ఉండదని ప్రముఖ చెఫ్ పరుల్ గుప్తా చెప్పారు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే మార్కెట్ స్టైల్ పనీర్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.

కావాల్సిన పదార్థాలేంటి?

ఫుల్ ఫ్యాట్ మిల్క్ (కొవ్వు ఎక్కువగా ఉన్న పాలు) – 2 లీటర్లు
వెనిగర్ – మూడు టేబుల్ స్పూన్లు
సాధారణ నీరు – 1/2 కప్పు
కోల్డ్ వాటర్ – ఒక బాటిల్

మార్కెట్లో స్టైల్ పనీర్ ఎలా తయారు చేయాలి?

మార్కెట్ స్టైల్ పనీర్ కోసం ముందుగా పాన్‌లోకి కొంచెం నీరు పోయండి. ఆపై 2 లీటర్ల ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ యాడ్ చేయండి. ఇప్పుడు పాలను స్టవ్ మీద ఉంచి ఎక్కువ మంట మీద మరగించాలి. అప్పుడప్పుడు ఒక చెంచాతో కలుపుతూ.. పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ నుంచి తీసేయండి.
ఇప్పుడు పాలు విరగడానికి.. నిమ్మకాయకు బదులుగా వెనిగర్ యాడ్ చేయాలి. అయితే, ఈ విధానం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలోకి మూడు చెంచాల వెనిగర్ తీసుకోండి. అందులో అరకప్పు నీటిలో కూడా కలిపి రెండిండిని బాగా మిక్స్ చేయండి.

పాలు విరగాలంటే ఏం చేయాలి?

ఇప్పుడు మరిగించిన పాలలో వెనిగర్ నీటి మిశ్రమాన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు పాల విరడం మీరు గమనించవచ్చు. అది జున్నులా కనిపిస్తుంది. ఇప్పుడు విరిగిన పాలకు చల్లటి నీరు యాడ్ చేయండి. ఈ చల్లటి నీరు వెనిగర్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు ఒక శుభ్రమైన కాటన్ వస్త్రాన్ని తీసుకుని దానిలో విరిగిన పాలు ఉంచండి.

ఆ తర్వాత కాటన్ వస్త్రాన్ని మూటలా ఉంచి నీటిని ఫిల్టర్ చేయండి. ఇప్పుడు మిగిలిన జున్నును గుడ్డలోనే ఉంచి దానిని ముడితో తేలికగా కట్టండి. ఇప్పుడు పనీర్ మూటపై ఒక ప్లేట్ ఉంచండి. ఆ తర్వాత దానిపై బరువు ఉంచండి. దానిని 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి.

మార్కెట్ స్టైల్ పనీర్ రెడీ

చివరగా పనీర్ మూటపై బరువును తీసేయండి. బరువు తీసినప్పుడు సాఫ్ట్‌గా ఉండే పనీర్ రెడీ అయినట్లు మీరు గమనిస్తారు. ఇప్పుడు దానిని ముక్కలుగా కట్ చేసి కూర చేసుకోవచ్చు. మిగిలిన భాగాన్ని నీటితో నిండి ఉన్న ఒక కంటైనర్‌లో ఉంచి మూతను బాగా కవర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. మిగిలిన పనీర్ ఇలా ఉంచి.. ఫ్రిజ్‌లో ఉంచితే అది వారం వరకు తాజాగా ఉంటుందని పరుల్ గుప్తా చెబుతున్నారు.

పనీర్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

  1. పనీర్‌లో కాల్షియం అధికంగా ఉంటుంది. కాల్షియం ఎక్కువగా ఉండే పనీర్ తినడం ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. ఇది కీళ్ళ నొప్పుల్ని నివారించడానికి సాయపడుతుంది.
  2. పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా సాయపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్లను నివారించడానికి, వేగంగా కోలుకోవడానికి సాయపడుతుంది.
  3. పనీర్‌లో ఉండే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం సాధారణ రక్తపోటు స్థాయిలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పనీర్ రక్తపోటు రోగులకు చాలా మంచి ఆప్షన్.
  4. కండరాల నిర్మణానికి, వాటిని బలంగా మార్చడానికి పనీర్ చాలా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు పనీర్ తినవచ్చు.
  5. ఇందులో అధిక నాణ్యత ప్రోటీన్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టు, చర్మానికి సాయపడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • easy tips
  • health care
  • healthy benefits
  • paneer
  • Paneer Benifits

Related News

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd