Liver Health: మీ లివర్ సమస్యలో ఉందని ఈ లక్షణాలతో తెలుసుకోవచ్చు..
లివర్ సమస్యలను గుర్తించడం కష్టమే. కొన్ని సందర్భాల్లో లివర్ సమస్యలు ఉంటే లక్షణాలు (Symptoms) కనిపిస్తూ ఉంటాయి.
- Author : Maheswara Rao Nadella
Date : 19-02-2023 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
లివర్ (Liver) మన శరీరంలో 500 పైగా పనులు నిర్వహిస్తుంది. మన శరీరంలోని జీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని లవర్ ఫిల్టర్ చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణం చేయడానికి కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. మనం తీసుకన్న ఆహారంలోని వ్యర్థాలను, విషతుల్యాలను సైతం లివర్ తొలగిస్తుంది. మన శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు, కొవ్వులు, రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా లివర్ నియంత్రిస్తుంది. మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి లివర్ కీలకం. ముఖ్యమైన హార్మోన్లను, ఎంజైమ్‌లను లివర్ (Liver) తయారు చేస్తుంది. మన శరీరంలో కీలక అవయవమైన కాలేయం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. నిజానికి, లివర్ సమస్యలను గుర్తించడం కష్టమే. చాలా వరకు 90 శాతం కాలేయం దెబ్బతినేంతవరకు వ్యాధి లక్షణాలు బయటపడవు. అయితే, లివర్ సమస్యలు ఉంటే.. కొన్ని సందర్భాల్లో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
కడుపులో సమస్యలు
నోటి దుర్వాసన
కళ్లు పసుపు పచ్చగా మారితే
మూత్రం రంగు మారితే
చేతులు, కాళ్ల వాపు
ఈ జాగ్రత్తలు పాటించండి
లివర్‌ను ఆరోగ్యంగా ఉండాలంటే.. సరైన జీవనశైలని పాటించాలని ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డా. శరద్ కులకర్ణి అన్నారు. మీ ఆహారంలో ఆకు కూరలు, పండ్లు, నానబెట్టిన బాదం, ఎర్ర బియ్యం తీసుకోవాలని సూచించారు. ప్రాసెస్ చేసిన ఆహారం, ప్యాకేజ్ ఆహారం, స్వీట్స్‌కు వీలైనంత దూరంగా ఉండాలని అన్నారు.
Also Read: Heart Failure: యువకుల్లో హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలను గుర్తించిందిలా