Diabetes: మీకు షుగర్ ఉందా.. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అస్సలు తినకండి!
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదే కానీ,షుగర్ వ్యాధి ఉన్నవారు కొన్ని రకాల డ్రైఫ్రూట్స్ ని తినక పోవడమే మంచిదని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:03 PM, Fri - 10 January 25

డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరతాయి అన్న విషయం తెలిసిందే. వీటిలో చేయడానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి. అయితే డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదే కానీ అలా అని ఎక్కువగా తినడం అసలు మంచిది కాదు. మోతాదుకు మించి తీసుకుంటే సమస్యలు తప్పవు అని చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ షుగర్ లెవెల్స్ ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అలాంటి డ్రై ఫ్రూట్స్ కి షుగర్ పేషెంట్లు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. మరి డయాబెటిస్ పేషెంట్లు ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కి దూరంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఫిగ్స్‌లో ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని చాలా మంది డ్రైగా తీసుకుంటారు. డ్రైడ్ ఫిగ్స్‌లో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి షుగర్ ఉన్నవారు వీటిని తక్కువగా తినడం మంచిది. పైనాపిల్ లో ఎక్కువగా షుగర్ ఉంటుంది. వీటిని తినకపోవడమే మంచిది. షుగర్ ఉన్నవారు వీటిని తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. డ్రైడ్ ఆప్రికాట్స్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల షుగర్ ఉన్నవారికి అంత మంచిది కాదు. ఇవి తినడానికి ఎంత రుచిగా ఉంటాయో అంత హెల్దీ కూడా అయితే, షుగర్ ఉన్నవారు తక్కువగా తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎండు ద్రాక్షలో కూడా ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది షుగర్ ఉన్నవారికి అంత మంచిది కాదట. నిజానికీ ఎండు ద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుతుంది. అయితే ఇందులో ఎండు ద్రాక్షలో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయట. కాబట్టి డయాబెటిస్ పేషెంట్లు ఎండు ద్రాక్షను తక్కువగా తీసుకోవడమే మంచిది. ఉపవాసం ఉన్నప్పుడు చాలా మంది డేట్స్ తీసుకుంటారు. దీని వల్ల ఎనర్జీగా ఉంటారు. అయితే షుగర్ ఉన్నవారు వీటిని తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఖర్జూరాల్లో ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. వీటిని తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్జూరాల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో ఎక్కువగా షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి షుగర్ ఉన్నవారు ఖర్జూరాలు తినకుండా ఉండడమే మంచిదని చెబుతున్నారు.