HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >What Happens If We Drink Tea In Paper Cup

Paper Cups: బయట పేపర్ కప్స్ లో టీ తాగుతున్నారా.. వెంటనే ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే?

బయట దొరికే పేపర్ కప్స్ లో టీ తాగడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదని, వాటి వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 12-03-2025 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Paper Cups
Paper Cups

రోడ్డు పక్కన టీ స్టాల్స్, కేఫ్ లలో పేపర్ కప్స్ లలో టీ ఎక్కువగా తాగుతూ ఉంటారు. కొన్ని ప్రదేశాలలో గాజు కప్పులలో టీ తాగుతూ ఉంటారు. నిజంగా పేపర్ కప్స్ లో టీ తాగడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదని ఇది చాలా డేంజర్ అని అంటున్నారు. మరి ఈ పేపర్ కప్స్ లో టీ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పేపర్ కప్స్ లో టీ తాగిన తర్వాత వాటిని మళ్లీ కడగాల్సిన పని ఉండదు. అందుకే బయట కేఫ్ అలాగే కాఫీ షాపులలో టీ షాప్ లలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

కొన్నిసార్లు పెళ్లిళ్లు ఏదైనా ఫంక్షన్ల సమయంలో ఇళ్లల్లో కూడా ఇలాంటి కప్పులను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పేపర్ కప్పులు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావట. కాగితపు కప్పుల్లో పెట్రోలియం ఆధారిత రసాయనం బిస్ఫెనాల్ ఉంటుందట. ఇది శరీరానికి చాలా హానికరం అని చెబుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి కప్పుల్లో టీ తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయట. వీటిలో ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే క్రిములు కూడా ఉంటాయని చెబుతున్నారు.

ఈ కప్పుల్లో ఉపయోగించే పూతలలో ఈ హానికరమైన బిస్ఫెనాల్స్, పెట్రోలియం ఆధారిత రసాయనాలు ఉంటాయట. కాబట్టి ఆ టీ తాగినప్పుడు అది నేరుగా కడుపులోకి వెళ్తుందని, అది నెమ్మదిగా ఎన్నో రకాల సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. ఇలా ప్రతిరోజూ ఒక పేపర్ కప్పులో టీ తాగడం వల్ల శరీరంలో బీపీఏ పెరుగుతుందట. ఇది శరీరానికి చాలా హానికరం అనే వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో బీపీఏ స్థాయి పెరిగితే క్యాన్సర్ ముప్పు పెరుగుతుందట. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందట. కాబట్టి ఇకమీదట అయినా బయట టీ షాప్ లో టీ తాగేటప్పుడు గాజు గ్లాస్ లేదంటే గాజు కప్పులలో టీ తాగడం మంచిది. ఒక్కసారి కదా పేపర్ కప్స్ లో తాగితే ఏమవుతుంది అనుకుని తాగితే మాత్రం అది నెమ్మదిగా దాని ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bisphenols
  • drink tea paper cups
  • health problems
  • Paper Cups
  • Petroleum
  • side effects

Related News

Do you have a habit of going to bed late at night? You could be at risk!

Sleep: రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉందా? మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రస్తుత రోజుల్లో చాలామంది రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోతున్న విషయం తెలిసిందే. ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. చాలామంది రాత్రి సమయంలో గంటల తరబడి అర్ధరాత్రి వరకు ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా యువత బయట తిరుగుతూ ఆలస్యంగా నిద్రపోయి, పొద్దున 10 గంటల వరకు నిద్రలేస్తూ ఉంటారు. ముఖ్యంగా సిటీ వాతావరణంలో ఈ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ అలవాటు అప్

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

Latest News

  • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

  • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

  • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd