ప్రతిరోజూ బిస్కెట్లు తింటున్నారా? అయితే జాగ్రత్త!
బిస్కెట్లలో సోడియం (ఉప్పు) ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచి సైలెంట్ కిల్లర్‌గా మారుతుంది.
- Author : Gopichand
Date : 26-12-2025 - 5:58 IST
Published By : Hashtagu Telugu Desk
Biscuits: చాలా మంది బిస్కెట్లు లేకుండా టీ తాగడానికి ఇష్టపడరు. ప్రతిరోజూ టీతో పాటు బిస్కెట్లు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, ఎంత తిన్నా పర్వాలేదని పొరబడుతుంటారు. అయితే, బిస్కెట్లు కూడా ఒక రకమైన జంక్ ఫుడ్ అని, వీటిని అతిగా తినడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బిస్కెట్లు తయారీలో మైదాను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనివల్ల పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే బిస్కెట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అసలు బిస్కెట్లు తింటే ఏమవుతుందో వివరంగా తెలుసుకుందాం.
ప్రతిరోజూ బిస్కెట్లు తినడం వల్ల కలిగే అనర్థాలు
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బిస్కెట్లు తిన్నప్పుడు అవి ప్రేగులకు అంటుకుపోయి జీర్ణక్రియను బలహీనపరుస్తాయి. ప్యాకెట్లలో లభించే బిస్కెట్లలో చక్కెర, మైదా, ట్రాన్స్ ఫ్యాట్, సోడియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో అనేక వ్యాధులకు కారణమవుతాయి.
బిస్కెట్ల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు
ఊబకాయం: బిస్కెట్లలో కేలరీలు, చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల బరువు వేగంగా పెరుగుతారు.
డయాబెటిస్: బిస్కెట్లలోని చక్కెర స్థాయిలు రక్తంలోని షుగర్ లెవల్స్‌ను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.
జీర్ణ సమస్యలు: మైదా వల్ల ప్రేగుల్లో పీచు పదార్థం లోపిస్తుంది. దీనివల్ల గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.
Also Read: చైనా ఆయుధాల వైఫల్యం.. పేలిపోయిన రాకెట్ సిస్టమ్!
గుండె జబ్బులు: ప్రతిరోజూ బిస్కెట్లు తినడం వల్ల శరీరంలో ట్రాన్స్ ఫ్యాట్, సోడియం పెరిగి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.
అధిక రక్తపోటు: బిస్కెట్లలో సోడియం (ఉప్పు) ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచి సైలెంట్ కిల్లర్‌గా మారుతుంది.
ప్రేగులకు హాని: మైదా ప్రేగుల గోడలకు అంటుకుపోయి కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
వీటికి బదులుగా వీటిని తీసుకోండి
- టీతో పాటు బిస్కెట్లకు బదులుగా ఈ క్రింది ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఎంచుకోండి.
- వేయించిన శనగలు
- వేయించిన తామర గింజలు
- తాజా పండ్లు
- ఇంట్లో తయారుచేసిన స్నాక్స్
- డ్రై ఫ్రూట్స్