Watermelon Seeds Benefits : పుచ్చకాయ గింజల వల్ల ఉపయోగాలు తెలిస్తే అస్సలు పడెయ్యారు..!!
పుచ్చకాయ గింజల్లో ప్రొటీన్లు, విటమిన్స్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ఐరన్, కాపర్, జింక్, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయట
- By Sudheer Published Date - 06:08 PM, Sun - 14 April 24
సమ్మర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు పుచ్చకాయలు (Watermelon ) తింటుంటారు. వేసవి తాపాన్ని తగ్గించడంలో పుచ్చకాయ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు ప్రతి రోజు పుచ్చకాయ తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే పుచ్చకాయ తింటూ వాటి గింజలను (Watermelon Seeds) పడేస్తుంటారు. కానీ ఆ గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని వైద్య నిపుణులు చెపుతున్నారు. పుచ్చకాయ గింజల్లో ప్రొటీన్లు, విటమిన్స్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ఐరన్, కాపర్, జింక్, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయట.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే మోనో అన్‌శ్యాచురేటెడ్, పాలీ అన్‌శ్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉండడం వల్ల గుండె నొప్పి, గుండెపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. అంతేకాకుండా, ఈ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయని అంటున్నారు. ఇంతే కాదు ముఖంపై ముడతలు త్లగించడంలో కూడా పుచ్చకాయ గింజలు బాగా పనిచేస్తాయట. ఇందులోని మెగ్నీషియం, జింక్, ఇతర ఖనిజ లవణాలు చర్మంలోని విష తుల్యాలను తొలగించి.. వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుపడతాయంటున్నారు. ఈ గింజల్లో చర్మమే కాదు.. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. అందుకే ఇక నుండైనా పుచ్చకాయ తో పాటు వాటి గింజలను కూడా తప్పకుండ తినమని సూచిస్తున్నారు.
Read Also : World War 3 : వరల్డ్ వార్-3 తప్పదా..? నోస్ట్రాడమస్ జోస్యం నిజమవుతుందా..?
Related News
Chemotherapy Side Effects: కీమోథెరపీ వలన కలిగే నష్టాలివే..!
మ్యూకోసైటిస్ అనేది కీమోథెరపీ సమయంలో సంభవించే వ్యాధి. ఇందులో నోటిలో, పేగుల్లో వాపు, నొప్పి సమస్య ఉంటుంది. కీమో తీసుకున్న 7-8 రోజుల తర్వాత వ్యాధి ప్రారంభమవుతుంది.