Oxygen Levels: రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకునేందుకు..
రక్తం (Blood)లో ఆక్సిజన్ స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్యం.
- By Maheswara Rao Nadella Published Date - 08:00 PM, Sat - 10 December 22
రక్తం (Blood)లో ఆక్సిజన్ (Oxygen) స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్యం. ఇందుకోసం కొన్ని పండ్ల (Fruits)ను కూడా ఉపయోగించవచ్చు. రోజువారీ ఆహారంలో పండ్లు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే, ఆక్సిజన్ (Oxygen) స్థాయి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఆక్సిజన్ (Oxygen) స్థాయిని పెంచే ఆహారాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి తరువాత రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం, ఆక్సిజన్ స్థాయిని నిర్వహించడం అవసరం. మనమందరం రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పండ్లను తింటాము. అయితే రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచే శక్తి పండ్లకు ఉందని చాలా మందికి తెలియదు.
బ్లూబెర్రీ (Blueberry):

రక్తం (Blood)లో ఆక్సిజన్ స్థాయిని పెంచడానికి, మీ ఆహారంలో బ్లూబెర్రీ (Blueberry)లను చేర్చడం అవసరం. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, విటమిన్ ఇ, సి, బి6, థయామిన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
స్ట్రాబెర్రీ (Strawberry):
![Free download Strawberry 4k Ultra HD Wallpaper Background Image 3840x2160 [3840x2160] for your Desktop, Mobile & Tablet | Explore 21+ 4K Strawberry Wallpapers | Strawberry Shortcake Wallpaper, Strawberry Wallpaper, Strawberry Shortcake Backgrounds](https://cdn.wallpapersafari.com/51/33/25U8Zs.jpg)
స్ట్రాబెర్రీ (Strawberry)లో రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బి6, ఫోలేట్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. రక్తంలో ఆక్సిజన్‌ను పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
పియర్ (Pear):

పియర్ (Pear)ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. పియర్ (Pear)లో విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, ప్రొటీన్, ఫైబర్, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి కాబట్టి దీన్ని క్రమం తప్పకుండా తినండి.
పైనాపిల్ (Pineapple):

పైనాపిల్ (Pineapple)లో విటమిన్ బి, ఫోలేట్, థయామిన్, పాంటోథెనిక్ యాసిడ్, బ్రోమెలైన్, నియాసిన్ వంటి పోషకాలు ఉన్నాయి. పైనాపిల్ (Pineapple)ను తరుచూ తినడం వల్ల ఇది ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
కివి (Kiwi):
![]()
కివి (KIWI) తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కివి (KIWI)లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్, కాపర్, సెలీనియం, ప్రొటీన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది రక్తంలో ఆక్సిజన్‌ను పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
కర్బూజ (Watermelon):

కర్బూజ (Watermelon)లో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి1, బి5, బి6 వంటి పోషకాలు ఉన్నాయి. కర్బూజ (Watermelon)ను తరుచూ తీసుకోవడం వల్ల ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిని ,రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది,
బొప్పాయి (Papaya):

బొప్పాయి (Papaya)లో పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు ఎ, బి, సి, ఫైబర్, కాల్షియం ఉన్నాయి, బొప్పాయి (Papaya)ని తరుచూ తెసుకోవడం వల్ల ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. ఇది రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.
Also Read: Weight Loss: శీతాకాలంలో బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఈ పండ్లు తినండి..