Summer: ఏంటి.. వేసవికాలం డయాబెటిస్ రోగులకు అంతప్రమాదకరమా?
వేసవికాలం డయాబెటిస్ రోగులకు చాలా సమస్యలను కలిగిస్తుందని, తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 09:00 AM, Sun - 16 February 25

వేసవికాలం ఇంకా మొదలుకాకముందే అప్పుడు ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో బయటికి రావాలి అంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. అందుకే వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉంటారు. డయాబెటిస్ పేషెంట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలట. లేదంటే సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరి డయాబెటిస్ పేషంట్లకు వేసవికాలంలో ముప్పేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. వేసవికాలం అధిక వేడి డయాబెటిక్ రోగులకు కష్టంగా ఉంటుందట.
తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం వల్ల శరీరంలో తేమను కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడంలో ఇబ్బంది పడతారు. అందుకే ఈ వేసవిలో శరీర ఉష్ణోగ్రత, చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచుకోవడానికి తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎండాకాలంలో నీరు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలి. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు అయినా త్రాగాలని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు లేదా శారీరక శ్రమ కారణంగా ఎక్కువగా చెమటలు పడుతుంటే నీరు తీసుకోవడం పెంచాలట.. కష్టపడి పని చేసేవారు ఇంకా ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకోవాలని చెబుతున్నారు.
ముఖ్యంగా వేసవికాలంలో దోసకాయ, పుచ్చకాయ, నారింజ, టమోటా, కర్బూజా వంటి నీరు అధికంగా ఉండే పండ్లు,కూరగాయలను చేర్చుకోవాలని చెబుతున్నారు. ఈ ఆహారాలు హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయట. ఇక సమ్మర్ లో కెఫిన్ కలిగిన కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాలకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. ఇవి రక్తంలో చక్కెరపై చెడు ప్రభావాన్ని చూపి శరీరం డీహైడ్రేట్ అయ్యే ప్రమాదాన్ని పెంచుతుందట. అలాగే సమ్మర్ లో కాటన్ దుస్తులను ధరించాలి. తద్వారా శరీరం చల్లగా ఉంటుంది. చెడు శరీర ఉష్ణోగ్రత చక్కెర స్థాయిని పాడు చేస్తుందట. సన్ బర్న్‌ను నివారించడానికి సన్‌స్క్రీన్ ను ఉపయోగించాలని చెబుతున్నారు. అలాగే వేసవికాలంలో షుగర్ పేషెంట్లు చేయాల్సిన పని ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేసుకుంటూ ఉండాలట.