HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Stop Dry Skin In Winter With Health Benefits Of Sesame Oil

Health Benefits Of Oil: మెరిసిపోయే చ‌ర్మం కావాలా.. అయితే ఈ ఆయిల్‌ను ట్రై చేయండి!

నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల శరీరానికి బలం చేకూరుతుందని, చర్మం మెరిసిపోయి ముడతలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

  • Author : Gopi Date : 25-12-2024 - 3:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Benefits Of Oil
Health Benefits Of Oil

Health Benefits Of Oil: చలికాలంలో బాడీ మసాజ్ చాలా ముఖ్యం. మసాజ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కండరాలు బలపడతాయి. బాడీ మసాజ్ కోసం చాలా నూనెలు (Health Benefits Of Oil) అందుబాటులో ఉన్నాయి. కానీ నువ్వుల నూనె చాలా ప్రయోజనకరమైనదని ప‌లువురు నిపుణులు చెబుతున్నారు. చాలా ఇళ్లలో నువ్వుల నూనెను వంటకు ఉపయోగిస్తారు. మీరు చలికాలంలో నువ్వుల నూనెతో మసాజ్ చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

నిపుణులు ఏమంటున్నారు?

నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల శరీరానికి బలం చేకూరుతుందని, చర్మం మెరిసిపోయి ముడతలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నువ్వుల నూనెతో మసాజ్ చేయడానికి ముందు నూనెను ఎండ‌లో లేదా వేడి చేయాల‌ని సూచిస్తున్నారు.

Also Read: Dense Fog : ఢిల్లీని దట్టమైన పొగమంచు.. విమానాల రాకపోకలకు అంతరాయం..!

కండరాలు బలపడతాయి

ప్రతిరోజూ నువ్వుల నూనెతో మసాజ్ చేస్తే కండరాలు బలపడతాయి. కండరాలు బలంగా మారినప్పుడు శరీరంలో నొప్పి తగ్గుతుంది. మీ శరీరంలోని ఏదైనా భాగంలో నొప్పి ఉంటే మీరు నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు. ఎండలో కూర్చొని నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవ‌డం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

ఒత్తిడి తక్కువగా ఉంటుంది

నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల ఆందోళన, ఒత్తిడి రెండూ తగ్గుతాయి. నువ్వుల నూనెలో టైరోసిన్ అనే పోషకం ఉంటుంది. ఇది మెదడులో సెరోటోనిన్ హార్మోన్‌ను పెంచుతుంది. ఇది మీ మానసిక స్థితిని చక్కగా ఉంచుతుంది. మీరు సంతోషంగా ఉంటారు. ఆందోళన, ఒత్తిడికి దూరంగా ఉండాలనుకుంటే శీతాకాలంలో ప్రతిరోజూ నువ్వుల నూనెతో మసాజ్ చేయండి.

ఎముకలు బలపడతాయి

పెరుగుతున్న వయస్సుతో మన ఎముకలు బలహీనంగా మారడం ప్రారంభిస్తాయి. దీనికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చలికాలంలో నువ్వుల నూనెతో శరీరమంతా మసాజ్ చేసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి. మీరు కీళ్ల నొప్పులకు కూడా దూరంగా ఉండవచ్చు. మీకు కావాలంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాత కాల్షియం ఔషధాన్ని కూడా తీసుకోవచ్చు. ఇది మీకు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health benefits
  • Health News
  • health tips
  • lifestyle
  • Lifestyle News
  • Sesame Oil
  • Sesame Oil benefits

Related News

Jeans

జీన్స్ ప్యాంట్‌తోనే ప‌డుకుంటున్నారా?

జీన్స్ క్లాత్ చెమటను సరిగ్గా పీల్చుకోదు. రాత్రంతా చర్మంపై తేమ, చెమట అలాగే పేరుకుపోవడం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందుతాయి.

  • Muskmelon Peel

    కర్బూజా పండు కంటే తొక్కలే ఎక్కువ ప్ర‌యోజ‌నం చేకూరుస్తాయా?

  • Side Effects Of Chia Seeds

    చియా సీడ్స్ అతిగా తీసుకుంటే ప్రమాదకరమా?

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd