Soleus Push Ups: సోలస్ పుషప్‌లు అంటే ఏమిటి? దీని వలన ఉపయోగం ఉందా?
ఈ వ్యాయామాన్ని టీవీ చూస్తూ ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ లేదా ఫోన్‌లో మాట్లాడుతూ కూడా సులభంగా చేయవచ్చు. దీనికి ఎటువంటి పరికరాలు అవసరం లేదు. నిలబడాల్సిన అవసరం కూడా లేదు.
- By Gopichand Published Date - 07:30 AM, Tue - 1 July 25

Soleus Push Ups: భోజనం తర్వాత చాలా మంది డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటారు. నిజానికి భోజనం తర్వాత కొద్దిగా నడవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ ఈ రోజుల్లో బిజీ జీవనశైలిలో ప్రతి ఒక్కరికీ దీనికి సమయం ఉండదు. దీని కారణంగా చాలా మందిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కూర్చొని చేసే ఒక సులభమైన వ్యాయామం మీ రక్తంలో చక్కెర స్థాయిని 52% వరకు తగ్గించగలదు. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది.
సోలస్ పుషప్‌లు చేయండి
మీకు డయాబెటిస్ ఉన్నా లేదా సమయం కొరత ఉన్నా ఈ వ్యాయామం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇటీవల జరిగిన ఒక ఆరోగ్య అధ్యయనం ప్రకారం.. ‘సోలస్ పుషప్‌లు’ (Soleus Push Ups) లేదా ‘సీటెడ్ కాఫ్ రైజెస్’ (Seated Calf Raises) అనే సరళమైన కాలి కదలిక శరీరం చక్కెరను ఉపయోగించే విధానంపై పెద్ద ప్రభావం చూపగలదు. ఈ వ్యాయామం కాళ్లలోని సోలస్ కండరాన్ని సక్రియం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెరను మరింత సమర్థవంతంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది.
సోలస్ పుషప్‌లు అంటే ఏమిటి?
- ఈ వ్యాయామాన్ని ఎవరైనా, ఎక్కడైనా చేయవచ్చు. కుర్చీ, సోఫా, కారు సీటు లేదా ఆఫీస్ డెస్క్ వద్ద కూర్చొని కూడా చేయొచ్చు.
- మీ కాలి ముందు భాగాన్ని నేలపై ఉంచండి. ఆ తర్వాత మెల్లగా మీ మడమను పైకి ఎత్తి, మళ్లీ కిందికి తీసుకురండి. దీన్ని ఒకేసారి సౌకర్యవంతంగా కొన్ని నిమిషాల పాటు చేయవచ్చు.
- ఈ వ్యాయామాన్ని టీవీ చూస్తూ ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ లేదా ఫోన్‌లో మాట్లాడుతూ కూడా సులభంగా చేయవచ్చు. దీనికి ఎటువంటి పరికరాలు అవసరం లేదు. నిలబడాల్సిన అవసరం కూడా లేదు.
ఈ వ్యాయామం ఎలా పనిచేస్తుంది?
సోలస్ కండరం కాఫ్ (పిరుదుల)లో లోతుగా ఉంటుంది. ఇది ఇతర పెద్ద కండరాల లాగా త్వరగా అలసిపోదు. దీనికి విరుద్ధంగా ఈ కండరం ఎక్కువ సమయం నడవడానికి లేదా కదలడానికి రూపొందించబడింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. సోలస్ కండరాన్ని సక్రియం చేయడం వల్ల శరీరంలో ‘ఆక్సిడేటివ్ మెటబాలిజం’ పెరుగుతుంది. ఈ ప్రక్రియ శరీరాన్ని గ్లైకోజన్‌ను ఉపయోగించకుండా చక్కెరను శక్తిగా మార్చడానికి అనుమతిస్తుంది.
అధ్యయనం ఏమి చెబుతోంది?
అధ్యయనంలో తేలింది ఏమిటంటే.. రోజులో ఎక్కువ సమయం కూర్చొని పనిచేసే వ్యక్తులు ‘సోలస్ పుషప్‌లను’ క్రమం తప్పకుండా చేస్తే వారి రక్తంలో చక్కెర స్థాయి 52% వరకు తగ్గుతుంది. అలాగే వారి ఇన్సులిన్ స్థాయి 60% వరకు తగ్గుతుంది. ఈ వ్యాయామం ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్, కూర్చొని పనిచేసే వ్యక్తులకు ప్రభావవంతంగా ఉంటుంది.