రాత్రిపూట నిద్ర పట్టడంలేదా.. అయితే కారణాలీవే?!
ప్రతిరోజూ రాత్రి 3 గంటలకు అకస్మాత్తుగా మెలకువ రావడం అంటే మీ మెదడు ఒత్తిడి, భయం లేదా అతిగా ఆలోచించడం వల్ల విశ్రాంతి తీసుకోవడం లేదని అర్థం.
- Author : Gopichand
Date : 11-01-2026 - 5:30 IST
Published By : Hashtagu Telugu Desk
Waking Up At Night: ఆరోగ్యకరమైన జీవితానికి సరైన నిద్ర చాలా అవసరం. ప్రతిరోజూ 8 గంటల నిద్ర ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఆయుర్వేదం- వైద్య శాస్త్రం ప్రకారం.. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నిద్రపోవడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో శరీరం తనను తాను మరమ్మత్తు చేసుకుంటుంది. హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. మెదడుకు ప్రశాంతత లభిస్తుంది. అయితే మీకు ప్రతిరోజూ రాత్రి 3 గంటలకు మెలకువ వస్తుంటే అది కేవలం నిద్రలేమి సమస్య మాత్రమే కాదు శరీరంలో జరుగుతున్న ఏదో ఒక అనారోగ్యానికి సంకేతం కావచ్చు.
రాత్రిపూట నిద్ర మేల్కొనడానికి కారణాలు
డిటాక్స్ వ్యవస్థపై ప్రభావం
ఆయుర్వేదం ప్రకారం.. రాత్రి 1 నుండి 3 గంటల సమయం కాలేయానికి సంబంధించినది. ఈ సమయంలో శరీరం నుండి విషతుల్యాలను బయటకు పంపే ప్రక్రియ జరుగుతుంది. ఒకవేళ మీకు ఆ సమయంలో మెలకువ వస్తే ఈ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది.
Also Read: భారతదేశంలో అత్యంత అందమైన రైలు మార్గాలివే!!
యాంగ్జైటీ సంకేతం
ప్రతిరోజూ రాత్రి 3 గంటలకు అకస్మాత్తుగా మెలకువ రావడం అంటే మీ మెదడు ఒత్తిడి, భయం లేదా అతిగా ఆలోచించడం వల్ల విశ్రాంతి తీసుకోవడం లేదని అర్థం.
రక్తపోటు ముప్పు
వైద్య పరిశోధనల ప్రకారం.. రాత్రి 2 నుండి 4 గంటల మధ్య గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో నిద్ర మెలకువ వచ్చి, కంగారుగా అనిపిస్తే అది హైబీపీకి సంకేతం కావచ్చు.
రోగనిరోధక శక్తి తగ్గడం
మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీరం కొత్త కణాలను తయారు చేస్తుంది. వ్యాధులతో పోరాడటానికి సిద్ధమవుతుంది. పదేపదే నిద్ర మెలకువ రావడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది.
రాత్రి 3 గంటలకు నిద్ర మెలకువ వస్తే ఏం చేయాలి?
మొబైల్‌కు దూరం: నిద్రపోవడానికి ఒక గంట ముందు నుండే మొబైల్ చూడటం మానేయాలి. ఇది మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది.
తేలికపాటి ఆహారం: రాత్రిపూట నూనెలో వేయించిన పదార్థాలు లేదా భారీ భోజనం తీసుకోకూడదు. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతిని నిద్రకు ఆటంకం కలుగుతుంది.
కెఫీన్ నియంత్రణ: కాఫీ, టీ వంటి కెఫీన్ ఎక్కువగా ఉండే పానీయాలను రాత్రిపూట తీసుకోకండి.
పాలు తాగడం: పడుకునే ముందు గోరువెచ్చని పాలు లేదా పసుపు పాలు తాగడానికి ప్రయత్నించండి.
క్రమశిక్షణ: ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయే అలవాటు చేసుకోండి. మీ దైనందిన జీవితంలో యోగా, ధ్యానాన్ని భాగం చేసుకోండి.