Lychee : ఎర్రని అందంతో ఆకట్టుకునే ఈ పండ్లు..ఆరోగ్యానికి అమృతమే..!
లిచి పండ్లు తినడం ద్వారా శరీరానికి విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా అందుతాయి. ముఖ్యంగా విటమిన్ C ఎక్కువగా లభిస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- By Latha Suma Published Date - 03:23 PM, Tue - 2 September 25

Lychee : చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా, రుచిలో తియ్యగా ఉండే లిచి పండ్లు మన రోడ్ల పక్కన చిన్న బండ్లపై విక్రయించబడుతున్నాయి. వెలుపల ఎరుపు రంగులో ఉండే ఈ పండ్లకు లోపల తెల్లగా, రసంతో నిండిన గుజ్జు ఉంటుంది. ఇందులో నల్లని విత్తనం కూడా ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ లిచి పండ్లలో ఎన్నో విలువైన పోషకాలు దాగి ఉన్నాయి. లిచి పండ్లు తినడం ద్వారా శరీరానికి విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా అందుతాయి. ముఖ్యంగా విటమిన్ C ఎక్కువగా లభిస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలోని ఐరన్‌ను శోషించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
పొటాషియం సమృద్ధిగా ఉండే లిచి పండ్లు బీపీ నియంత్రణకు తోడ్పడతాయి. ఇది గుండె పనితీరును మెరుగుపరచి గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది. రక్తనాళాల్లో వాపులను తగ్గించి, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థ బాగుండేలా చేస్తుంది. మలబద్ధకాన్ని నివారించడంలో, గ్యాస్, అజీర్నం వంటి సమస్యలను తగ్గించడంలో లిచి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలిఫినాల్స్, రుటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కణజాలాల రక్షణకు తోడ్పడి క్యాన్సర్, గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
లిచి పండ్లలో 80%కి పైగా నీరు ఉంటుంది. కాబట్టి వేసవిలో హైడ్రేషన్ కోసం లిచి ఒక మంచి ఆప్షన్. శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడడంలో, డీహైడ్రేషన్ నివారణలో ఇది సహాయపడుతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలోనూ లిచి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తూ, మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. లిచి పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉన్నాయి. శరీరంలో ఉండే అంతర్గత, బాహ్య వాపులను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. గుండె కండరాల వాపులు, రక్తనాళాల ఇన్‌ఫ్లమేషన్ తగ్గి హృదయ ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే ఆర్థరైటిస్ వల్ల కలిగే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
బరువు తగ్గాలనుకునే వారు కూడా లిచి పండ్లను ఆహారంలో చేర్చుకోవచ్చు. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉండటం, ఫైబర్ అధికంగా ఉండటం వలన తక్కువ కాలొరీస్‌లో ఎక్కువ సేపు తృప్తిగా ఉండే ఫీలింగ్ ఇస్తుంది. ఇది ఓవరీఈటింగ్‌ను తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే, లిచి పండ్లను మితంగా తీసుకోవాలి. పండిన పండ్లను మాత్రమే తినాలి. పచ్చిగా ఉండే లిచీల్లో హైపోగ్లైసిన్ అనే హానికరమైన సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరానికి నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి పూర్తిగా పండిన లిచి పండ్లనే తినడం మంచిది. ఈ విధంగా, రుచిలో మెరిసే లిచి పండ్లు ఆరోగ్యానికి ఓ వరం లాంటివే. వీటిని తినడం ద్వారా శక్తి, ఆరోగ్యం, జీర్ణశక్తి, గుండె పనితీరు వంటి అనేక అంశాల్లో లాభాలు పొందవచ్చు. అయితే మితంగా, సరైన రీతిలో తీసుకుంటేనే మంచి ఫలితాలు పొందగలమని గుర్తుంచుకోవాలి.
Read Also: Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్ పై లోకేశ్ సెటైర్