HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >If You Have Kidney Stones You Should Not Eat Tomatoes

Kidney Stones: కిడ్నీలో స్టోన్స్ ఉంటే టమాటా తినకూడదు, క్యాల్షియం అధికంగా తీసుకోకూడదు… ఇవన్నీ అవాస్తవాలు… అసలు విషయం తెలుసుకోండి..!!

  • Author : Vamsi Chowdary Korata Date : 20-05-2026 - 11:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
If you have kidney stones, you should not eat tomatoes.
If you have kidney stones, you should not eat tomatoes.

కిడ్నీలో రాళ్లు ఉంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి! ఏవి తినకూడదు!! ఏవి తినాలి!! కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే ఎలాంటి పానీయాలు తాగాలి!! ఇలాంటి విషయాలు చాలా వినే ఉంటారు! కిడ్నీలో రాళ్ల గురించి చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

కిడ్నీలో రాళ్లు ఉంటే వెన్నునొప్పి బాధిస్తుంది:

కిడ్నీ లోపల రాళ్లు ఉంటే దాదాపు నొప్పి ఉండదు. కానీ మూత్రాశయ అవరోధం, మూత్రనాళం అడ్డంకి నుండి వెన్నుపై ఒత్తిడి కారణంగా మూత్రపిండాల వాపు ఏర్పడుతుంది. చాలామందికి వికారం లేదా వాంతులతో తీవ్రమైన నొప్పి వస్తుందని చెబుతుంటారు. అప్పుడప్పుడు, మూత్రంలో రక్తం, మూత్రంలో మంటలు కూడా వస్తాయని అంటుంటారు.

టమోటాలు తినకూడదు:

కిడ్నీలో రాళ్లు ఉంటే టమోటాలు తినకూడదని చెప్పడం అబద్ధం. అయితే రక్తంలో పొటాషియం స్థాయిలు ఎక్కువగా ఉంటే టమోటాలు తినకూడదు. కాకపోతే టొమాటోలు ఇతర సీడ్ వెజిటేబుల్స్ తగిన మోతాదులో తీసుకోవాలి. కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే పుష్కలంగా పానీయాలు ఎక్కువగా తాగాలి.

కాల్షియం తీసుకోవద్దు:

సాధారణ స్థాయిలో ఆహారంలో కాల్షియం తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది. కాబట్టి, పాలు లేదా పాల ఉత్పత్తులను మితంగా తీసుకోవాలి. కాల్షియం తగ్గించడం వల్ల ఎముక డీ-మినరలైజేషన్, ఆక్సలేట్ శోషణ పెరుగుతుంది. ఇది కిడ్నీల్లో రాళ్లు ఏర్పాడేందుకు దారితీస్తుంది. కాబట్టి కాల్షియం, పాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి.

మందులు కిడ్నీ రాళ్లను కరిగించగలవు:

తక్కువ శాతం మంది రోగులలో, రాళ్లు యూరిక్ యాసిడ్ లేదా సిస్టీన్‌తో ఉంటే, రాళ్లను కరిగించేందుకు మందులు వాడవచ్చు. కిడ్నీలో చాలా వరకు కాల్షియం ఆక్సలేట్ లేదా ఫాస్పేట్ వల్ల రాళ్లు ఏర్పడతాయి. ఇవి చిన్నగా ఉంటే మందులతో కరిగించవచ్చు. పెద్దగా ఉంటే మందులతో కరగలేవు. వాటిని సర్జరీ ద్వారా తొలగించాల్సి వస్తుంది.

బార్లీ నీరు, క్రాన్బెర్రీ జ్యూస్ :

బార్లీ వాటర్, క్రాన్బెర్రీ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు బయటకు వస్తాయని వినే ఉంటారు. కానీ ఇది అబద్ధం. ఎందుకంటే రాళ్ల నివారణ లేదా క్లియరెన్స్ కోసం బార్లీకి నిర్ధిష్ట ఆధారాలేమీ లేవు. క్రాన్బెర్రీ జ్యూస్ తరచుగా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. ఇది రాళ్లను తొలగించడంలో సహాయం చేయదు. రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. చాలా వరకు ద్రవాలతోనే కిడ్నీలో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ.. రాళ్లు కానీ ఉంటే మూత్రం రూపంలో బయటకు వెళ్తాయి. అయితే కిడ్నీల్లో రాళ్లకు కారణమయ్యే లవణాల సాంద్రతను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. నిజానికి నిమ్మరసం, సిట్రస్ పానీయాలు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటాన్ని తగ్గిస్తాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • calcium
  • health care
  • health tips
  • Kidney Stone
  • Kidney Stone Problem
  • Kidney Stone tips
  • Kidney Stones Symptoms

Related News

7 Tips to Curb Insomnia for Stress Management

Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Stress Management: “ఒత్తిడి” అనేది మనం చేసే రోజువారీ కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో ముఖ్యమైనది ఫోన్‌కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్‌లో మునిగిపోవడం అనేది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd