HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >How To Use Coconut Oil For Hair And Skin

Coconut Oil: రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాస్తే ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!

రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో తేలికపాటి మసాజ్ చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి (Relax) లభించడమే కాకుండా ఒత్తిడి (Stress) కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

  • Author : Gopichand Date : 05-11-2025 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Coconut Oil
Coconut Oil

Coconut Oil: చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఈ రోజుల్లో చాలా మంది ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. అయితే మీ ఇంట్లో ఉండే కొబ్బరి నూనె (Coconut Oil) అనేక చర్మ సమస్యలకు పరిష్కారం చూపగలదు. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. జుట్టు విషయంలోనైనా, చర్మం విషయంలోనైనా కొబ్బరి నూనె ఒక సహజ సిద్ధమైన పదార్థం. ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా లోతుగా పోషణను అందిస్తుంది. ఇది చర్మానికి, వెంట్రుకలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను చర్మానికి లేదా జుట్టుకు రాసుకుంటే మీకు ఈ అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి.

చర్మం, జుట్టుకు ప్రయోజనాలు

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొబ్బరి నూనె చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మెరిసే చర్మం కోసం: రాత్రి పడుకునే ముందు ముఖానికి, చేతులకు, కాళ్ళకు కొద్దిగా కొబ్బరి నూనె రాసుకోవాలి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. ఇది పొడి చర్మాన్ని దూరం చేసి, చర్మానికి మెరుపును ఇస్తుంది.

Also Read: Virat Kohli- Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు బిగ్ షాక్‌!

జుట్టుకు లాభాలు: జుట్టుకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. దీనివల్ల జుట్టు బలంగా, ఒత్తుగా పెరుగుతుంది. జుట్టుకు సరైన తేమ అంది చుండ్రు (Dandruff) సమస్య తగ్గుతుంది. అంతేకాక ఇది జుట్టు రాలడాన్ని (Hair Fall) కూడా తగ్గిస్తుంది.

పెదాల పగుళ్లు దూరం

మీరు పెదాల పగుళ్ల సమస్యతో బాధపడుతున్నట్లయితే కొబ్బరి నూనె ఒక అద్భుతమైన పరిష్కారం. పగిలిన పెదాలు లేదా పగిలిన మడమల పొడితనాన్ని కొబ్బరి నూనె దూరం చేయగలదు. దీని కోసం రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనెను పగిలిన ప్రాంతంలో రాయండి. ఇది రాత్రంతా పెదాలు, మడమలలో తేమను నిలుపుకొని, వాటిని మృదువుగా ఉంచుతుంది.

మంచి నిద్ర కోసం

రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో తేలికపాటి మసాజ్ చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి (Relax) లభించడమే కాకుండా ఒత్తిడి (Stress) కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తల లేదా పాదాలకు నూనె రాసుకుని పడుకుంటే మనస్సు శాంతించి, మంచి నిద్ర (Sound Sleep) పడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • coconut oil
  • Coconut Oil At Night
  • hair
  • Health News
  • lifestyle
  • skin
  • skin care

Related News

Ear Cancer

అల‌ర్ట్‌.. చెవి క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలివే!

ఇయర్ కెనాల్ క్యాన్సర్.. ఇది చెవి లోపలి గొట్టం (కెనాల్)పై కనిపిస్తుంది. కెనాల్ వెలుపలి భాగంలో గడ్డలు, ఏర్పడతాయి. దీనిని సర్జరీ ద్వారా నయం చేయవచ్చు.

  • Blood Pressure

    చలికాలంలో ఉద‌యం పూట రక్తపోటు ఎందుకు పెరుగుతుంది?!

  • High Heels

    హై హీల్స్ వేసుకున్నప్పుడు పాదాల నొప్పిని తగ్గించే అద్భుతమైన చిట్కా ఇదే!

  • Brown Eggs vs White Eggs

    గోధుమ రంగు గుడ్డు ఏ కోడి పెడుతుంది?

  • Air Journey

    దీర్ఘకాలిక విమాన ప్రయాణాల్లో టెన్నిస్ బాల్ ఎందుకు వెంట ఉంచుకోవాలి?

Latest News

  • సింగపూర్ సైన్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు

  • డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

  • అమెరికా కు భారీ ఆఫర్ ఇచ్చిన పాక్, ఉద్దేశ్యం అదేనా ?

  • అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు, 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం

  • జాబ్ క్యాలెండర్ కోసం హైదరాబాద్ లో రోడ్డెక్కిన నిరుద్యోగులు

Trending News

    • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

    • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

    • భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

    • సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

    • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd