Thyroid Issues: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే వెయిట్ లాస్‌కు ఈ టిప్స్ పాటించండి..!
- By Gopichand Published Date - 12:15 PM, Wed - 5 June 24

Thyroid Issues: ఈ రోజుల్లో వేగంగా మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. వాటిలో ఒకటి థైరాయిడ్ (Thyroid Issues). ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకార.. ఇది చాలా తీవ్రమైన వ్యాధి. ఇది శరీరంలోని జీవక్రియను నెమ్మదిస్తుంది. ఈ పరిస్థితిలో వ్యాయామం లేదా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించినప్పటికీ, బరువు నియంత్రణలో ఉండదు. ఇటువంటి పరిస్థితిలో మీరు కూడా థైరాయిడ్ సమస్యతో పోరాడుతుంటే.. మీ బరువు వేగంగా పెరుగుతూ ఉంటే మీరు ఈ సులభమైన చర్యలను అనుసరించడం ద్వారా మీ బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
థైరాయిడ్ రోగులు బరువును ఎలా నియంత్రించుకోవాలి?
థైరాయిడ్ నిపుణుల ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు తమ బరువును ఎలా అదుపులో ఉంచుకోవచ్చో చెప్పారు. నడకతో పాటు దాల్చిన చెక్క టీ, బెర్బెరిన్ లాంటి వాటిని తీసుకుంటే థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.
నడవండి
ఈ వ్యాధితో బాధపడేవారు వారానికి కనీసం 5 నుంచి 6 రోజులు 40 నిమిషాల నడక తప్పక తీసుకోవాలని నిపుణులు తెలిపారు. ఇది మీ శక్తిని ఖర్చు చేస్తుంది. మీ మానసిక స్థితి కూడా బాగుంటుంది. దీని కోసం మీరు ఉదయం ఖాళీ కడుపుతో నడకకు వెళ్ళవచ్చు. ఇది మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
దాల్చిన చెక్క టీ తాగండి
నడకతోపాటు మీరు రోజులో 2 నుండి 3 కప్పుల దాల్చిన చెక్క టీ తాగితే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్లను పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
We’re now on WhatsApp : Click to Join
బెర్బెరిన్
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తినడం తర్వాత మీరు మీ ఆహారంలో 500 ml బెర్బెరిన్ లేదా బార్బెర్రీ రిచ్ ఫుడ్‌ను చేర్చాలి. నిజానికి ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ, మెటబాలిజంను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది.