Detox : తరుచూ సిక్ అవుతుంటే.. ఈ ఫుడ్స్ ట్రై చేయండి..!
Detox : మనం తీసుకునే అన్‌హెల్దీ ఫుడ్ కారణంగా బాడీలో టాక్సిన్స్ పెరుగుతాయి. వీటి వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే, ఎప్పటికప్పుడు బాడీలోని టాక్సిన్స్ తొలగించుకోవాలి. అందుకోసం మన డైట్‌లో కొన్ని ఫుడ్స్ తినాలి. అవేంటో తెలుసుకోండి.
- By Kavya Krishna Published Date - 10:32 AM, Wed - 27 November 24

Detox : మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మనం తీసుకునే ఆహారం పోషకాహారంగా ఉండాలి, అప్పుడు మన శరీరానికి కావలసిన పోషణ, బలం, శక్తి అందుతుంది. కానీ ప్రస్తుత కాలంలో మలినాలు, కెమికల్స్‌తో నిండి ఉన్న ఆహారాలు మాత్రమే మనకు అందుతాయి. ఇవి మన శరీరంలో టాక్సిన్స్‌ను పెంచి, ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.
టాక్సిన్స్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి: ఒకటి సహజమైనవి, అంటే ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియలో ఏర్పడేవి; రెండవది కృత్రిమ టాక్సిన్స్, ఇవి రసాయనాలు, ఎరువులు వాడిన పంటలు, కృత్రిమ పదార్థాల ద్వారా మనకు చేరుతాయి. ఈ టాక్సిన్స్ వల్ల మన శరీరంలో అనేక రుగ్మతలు ఏర్పడతాయి. అందువల్ల, మన డైట్‌లో కొన్ని ఆరోగ్యకరమైన కూరగాయలు , పండ్లను చేర్చడం చాలా అవసరం. వీటి ద్వారా శరీరంలోని టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి.
నట్స్ , గింజలు
నట్స్ , గింజల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. వీటిని తినడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ వెలువడతాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఆహారాలు కూడా తీసుకోవాలి. ఇవి మన అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉదాహరణకు, బెర్రీస్, బెల్ పెప్పర్స్, సిట్రస్ ఫ్రూట్స్, బ్రకోలీ, చిక్కుళ్ళు, గ్రీన్ టీ.
పండ్లు
పండ్లలో సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీస్, పుచ్చకాయలు వంటివి చాలా మంచివి. ఇవి ఎక్కువ నీటిని కలిగి ఉంటాయి , విటమిన్స్ అందించాయి. వీటిని ప్రతిరోజూ తింటే శరీరంలో ఉన్న టాక్సిన్స్ పోయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కూరగాయలు
తాజా కూరగాయలు, ముఖ్యంగా బ్రకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రసెల్స్ స్ప్రౌట్స్ లో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం ద్వారా శరీరంలోని టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి, అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.
పసుపు
పసుపు పూర్వీకులు తరతరాలుగా వాడిన అద్భుతమైన పదార్థం. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి, అనారోగ్యాలను దూరం చేస్తాయి. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా అనుకూలంగా ఉంటుంది.
ప్రోబయోటిక్స్
పులియబెట్టిన ఆహారాలలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. వీటిని డైట్‌లో చేర్చడం ద్వారా ప్రేగులలో హానికరమైన బ్యాక్టీరియా తగ్గిపోతుంది. అలాగే, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం కూడా శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది.
ఉల్లిపాయలు, వెల్లుల్లి
ఉల్లి, వెల్లుల్లి లో సల్ఫర్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో డీటాక్స్ ప్రక్రియను ప్రేరేపించి, టాక్సిన్స్‌ని బయటికి తీసుకువెళ్లడానికి సహాయపడతాయి. వీటిని కూరల్లో, పచ్చిగా లేదా వేరు వేరు రూపాల్లో తీసుకోవచ్చు. అదేవిధంగా, నెయ్యి, వెన్న, తేనె, ఎండు అల్లం, నల్ల మిరియాలు, రాళ్ళ ఉప్పు కూడా డైట్‌లో చేర్చడం వల్ల టాక్సిన్స్‌ని తొలగించవచ్చు.
ఈ సులభమైన, సహజమైన మార్గాలను అనుసరించడం ద్వారా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది , శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి.
గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read Also : Textile Policy : ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10,000 కోట్ల పెట్టుబడులు.. 2 లక్షల ఉద్యోగాలు లక్ష్యం