Health Tips: రాత్రిపూట తరచూ టాయిలెట్‌కు వెళ్తున్నారా? అయితే సమస్య ఇదే!
రాత్రి నిద్రలో ఒకటి కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన కోసం లేవాల్సి వస్తోందా? ఇది కేవలం అలవాటు కాదు. టైప్-2 డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధి సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు (Health Tips) హెచ్చరిస్తున్నారు.
- By Gopichand Published Date - 12:27 PM, Fri - 28 March 25

Health Tips: రాత్రి నిద్రలో ఒకటి కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన కోసం లేవాల్సి వస్తోందా? ఇది కేవలం అలవాటు కాదు. టైప్-2 డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధి సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు (Health Tips) హెచ్చరిస్తున్నారు. ఈ సైలెంట్ కిల్లర్ రక్తంలో చక్కెర స్థాయిలను అసాధారణంగా పెంచుతూ గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదకర సమస్యలకు దారితీస్తుంది. చాలామంది ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది.
నిపుణుల ప్రకారం.. రాత్రిపూట తరచూ మూత్ర విసర్జన అవసరం శరీరం అదనపు రక్త చక్కెరను తొలగించే ప్రయత్నంగా ఉంటుంది. టైప్-2 డయాబెటిస్‌లో క్లోమం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం లేదా శరీర కణాలు గ్లూకోజ్‌ను సరిగా గ్రహించలేకపోవడం జరుగుతుంది. దీని వల్ల మూత్రపిండాలు అధిక చక్కెరను వడపోసేందుకు ఎక్కువగా పనిచేస్తాయి. ఫలితంగా మూత్ర విసర్జన పెరుగుతుంది. ఇది అధిక దాహం, గొంతు ఎండిపోవడం వంటి లక్షణాలకు కూడా దారితీస్తుంది.
ఈ వ్యాధి ఇతర సంకేతాల్లో ఊహించని బరువు తగ్గడం ఒకటి. శరీర కణాలు గ్లూకోజ్ నుంచి శక్తిని పొందలేకపోతే కొవ్వు, కండరాలను కరిగించి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల బరువు తగ్గుతారు. అలాగే గాయాలు నయం కావడంలో ఆలస్యం కూడా ఒక హెచ్చరిక. అధిక రక్త చక్కెర రక్త ప్రసరణను నెమ్మదిస్తుంది. గాయపడిన ప్రాంతానికి రక్తం సరిగా చేరకపోవడంతో గాయం తగ్గే ప్రక్రియ ఆలస్యమవుతుంది.
Also Read: Telangana Assembly : కేసీఆర్ ఫ్యామిలీ కి భయం ఏంటో చూపించిన సీఎం రేవంత్
దృష్టి సమస్యలు కూడా టైప్-2 డయాబెటిస్ రోగుల్లో సాధారణం. అధిక చక్కెర స్థాయిలు కంటి రక్తనాళాలను దెబ్బతీస్తాయి. దీనివల్ల చూపు మసకబారవచ్చు. నిద్రకు ముందు ఎక్కువ నీరు తాగడం వల్ల ఒకసారి టాయిలెట్‌కు వెళ్లడం సహజమైనప్పటికీ రాత్రంతా ఈ సమస్య కొనసాగితే వైద్య సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్య నిపుణులు ఈ లక్షణాలను గమనించిన వెంటనే రక్త చక్కెర పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే జీవనశైలి మార్పులు, మందులతో ఈ వ్యాధిని నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.