HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Hair Fall Control Tips

జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోండిలా!

ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఉల్లిపాయను తురిమి తీసిన రసాన్ని నేరుగా కుదుళ్లకు పట్టించాలి.

  • Author : Gopichand Date : 05-01-2026 - 8:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hair Fall
Hair Fall

Hair Fall: జుట్టును సరిగ్గా సంరక్షిస్తే అవి కుదుళ్ల నుండి చివర్ల వరకు ఆరోగ్యంగా ఉంటాయి. మనం తరచుగా రకరకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటాం. కానీ అవన్నీ జుట్టుపై మంచి ప్రభావాన్ని చూపవు సదా సరికదా కొన్నిసార్లు జుట్టును పాడుచేస్తాయి కూడా. ఇలాంటి సమయంలో మీరు ఆయుర్వేద ఇంటి చిట్కాలను ప్రయత్నించవచ్చు. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా జుట్టు వేగంగా పెరగడానికి కూడా సహాయపడతాయి. నిపుణుల ప్ర‌కారం.. సూచించిన ఒక అద్భుతమైన హెయిర్ స్ప్రే తయారీ విధానం ఇక్కడ ఉంది.

జుట్టు పెరుగుదల కోసం హోంమేడ్ హెయిర్ స్ప్రే

ఈ హెయిర్ స్ప్రేని తయారు చేయడానికి మీకు కావలసినవి

  • మందార పూలు
  • రోజ్మేరీ ఆకులు
  • ఒక చెంచా మెంతులు
  • ఒక చెంచా కలంజీ గింజలు (నల్ల జీలకర్ర)
  • కొన్ని ఎండిన గుంటగలగర ఆకులు (భృంగరాజ్)
  • 15 నుండి 20 కరివేపాకులు
  • 2 నుండి 3 లవంగాలు

తయారీ విధానం

ఈ పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి నీటితో కలిపి 10 నుండి 15 నిమిషాల పాటు బాగా మరిగించాలి. మిశ్రమం బాగా మరిగిన తర్వాత వడకట్టి, ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. ఈ స్ప్రేని 4 నుండి 5 రోజుల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత వాడటం మొదలుపెట్టాలి.

Also Read: బేబీ బంప్ తో ఉపాసన వైరల్ గా మారిన పిక్

ఎలా వాడాలి?

ఈ స్ప్రేని రోజు విడిచి రోజు జుట్టుకు పట్టించాలి. తల చర్మంపై స్ప్రే చేసి వేళ్లతో తేలికగా మర్దన చేయాలి. కనీసం గంటన్నర పాటు జుట్టుపై ఉంచుకోవాలి. ఇది జుట్టును దృఢంగా మార్చడానికి మెరుపును ఇవ్వడానికి, జుట్టు సాంద్రతను పెంచడానికి సహాయపడుతుందని నిపుణులు పేర్కొన్నారు.

మరికొన్ని ఉపయోగకరమైన చిట్కాలు

ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఉల్లిపాయను తురిమి తీసిన రసాన్ని నేరుగా కుదుళ్లకు పట్టించాలి.

మెంతి పేస్ట్

రాత్రంతా నానబెట్టిన 2-3 చెంచాల మెంతులను మరుసటి రోజు ఉదయం పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి. ఇది స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

కరివేపాకు- కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి మరిగించి, ఆ నూనెతో తలకు మర్దన చేయాలి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా జుట్టు త్వరగా తెల్లబడకుండా నిరోధిస్తుంది.

  • జుట్టును కడిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
  • జుట్టును సరిగ్గా కడగకపోతే జుట్టు రాలడం పెరుగుతుంది.
  • అతిగా వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయవద్దు.
  • జుట్టును గట్టిగా రుద్దుతూ కడగకూడదు. దీనివల్ల జుట్టు పొడిబారి విరిగిపోతుంది.
  • వారానికి కనీసం ఒక్కసారైనా నూనెతో మర్దన చేయడం వల్ల జుట్టు తేమను కోల్పోకుండా ఆరోగ్యంగా ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hair care tips
  • hair fall
  • Hair Spray
  • health
  • Health Tips Telugu
  • lifestyle

Related News

Shashankasana

శశాంకాసనం అంటే ఏమిటి? దాని ఉప‌యోగాలేంటి?

రోజంతా కూర్చుని పని చేయడం వల్ల వెన్ను, నడుము భాగంలో వచ్చే అలసటను ఇది తగ్గిస్తుంది. వెన్నెముకను సరళంగా మారుస్తుంది.

  • Typhoid Fever

    టైఫాయిడ్ జ్వ‌రం ఇంకా భ‌యంక‌రంగా మార‌నుందా?

  • Mobile Number Numerology

    మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

  • Drinking Tea

    టీ తాగడం వల్ల మన శరీరానికి కలిగే నష్టాల గురించి తెలుసా?

  • Broccoli vs Cauliflower.. Which is best for your health..?

    బ్రోకలీ vs కాలీఫ్లవర్‌.. మీ ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే..?

Latest News

  • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

  • బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ‌ద్ద ఎంత సంప‌ద ఉందంటే?

  • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

  • వీపీఎన్ సేవ‌ల‌పై జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం నిషేధం!

  • పొదుపు సంఘాల వారికీ చంద్రబాబు తీపికబురు

Trending News

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

    • చ‌రిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్‌!

    • సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!

    • డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd