జుట్టు రాలడాన్ని తగ్గించుకోండిలా!
ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఉల్లిపాయను తురిమి తీసిన రసాన్ని నేరుగా కుదుళ్లకు పట్టించాలి.
- Author : Gopichand
Date : 05-01-2026 - 8:37 IST
Published By : Hashtagu Telugu Desk
Hair Fall: జుట్టును సరిగ్గా సంరక్షిస్తే అవి కుదుళ్ల నుండి చివర్ల వరకు ఆరోగ్యంగా ఉంటాయి. మనం తరచుగా రకరకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటాం. కానీ అవన్నీ జుట్టుపై మంచి ప్రభావాన్ని చూపవు సదా సరికదా కొన్నిసార్లు జుట్టును పాడుచేస్తాయి కూడా. ఇలాంటి సమయంలో మీరు ఆయుర్వేద ఇంటి చిట్కాలను ప్రయత్నించవచ్చు. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా జుట్టు వేగంగా పెరగడానికి కూడా సహాయపడతాయి. నిపుణుల ప్రకారం.. సూచించిన ఒక అద్భుతమైన హెయిర్ స్ప్రే తయారీ విధానం ఇక్కడ ఉంది.
జుట్టు పెరుగుదల కోసం హోంమేడ్ హెయిర్ స్ప్రే
ఈ హెయిర్ స్ప్రేని తయారు చేయడానికి మీకు కావలసినవి
- మందార పూలు
- రోజ్మేరీ ఆకులు
- ఒక చెంచా మెంతులు
- ఒక చెంచా కలంజీ గింజలు (నల్ల జీలకర్ర)
- కొన్ని ఎండిన గుంటగలగర ఆకులు (భృంగరాజ్)
- 15 నుండి 20 కరివేపాకులు
- 2 నుండి 3 లవంగాలు
తయారీ విధానం
ఈ పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి నీటితో కలిపి 10 నుండి 15 నిమిషాల పాటు బాగా మరిగించాలి. మిశ్రమం బాగా మరిగిన తర్వాత వడకట్టి, ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. ఈ స్ప్రేని 4 నుండి 5 రోజుల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత వాడటం మొదలుపెట్టాలి.
Also Read: బేబీ బంప్ తో ఉపాసన వైరల్ గా మారిన పిక్
ఎలా వాడాలి?
ఈ స్ప్రేని రోజు విడిచి రోజు జుట్టుకు పట్టించాలి. తల చర్మంపై స్ప్రే చేసి వేళ్లతో తేలికగా మర్దన చేయాలి. కనీసం గంటన్నర పాటు జుట్టుపై ఉంచుకోవాలి. ఇది జుట్టును దృఢంగా మార్చడానికి మెరుపును ఇవ్వడానికి, జుట్టు సాంద్రతను పెంచడానికి సహాయపడుతుందని నిపుణులు పేర్కొన్నారు.
మరికొన్ని ఉపయోగకరమైన చిట్కాలు
ఉల్లిపాయ రసం
ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఉల్లిపాయను తురిమి తీసిన రసాన్ని నేరుగా కుదుళ్లకు పట్టించాలి.
మెంతి పేస్ట్
రాత్రంతా నానబెట్టిన 2-3 చెంచాల మెంతులను మరుసటి రోజు ఉదయం పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి. ఇది స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
కరివేపాకు- కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి మరిగించి, ఆ నూనెతో తలకు మర్దన చేయాలి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా జుట్టు త్వరగా తెల్లబడకుండా నిరోధిస్తుంది.
- జుట్టును కడిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- జుట్టును సరిగ్గా కడగకపోతే జుట్టు రాలడం పెరుగుతుంది.
- అతిగా వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయవద్దు.
- జుట్టును గట్టిగా రుద్దుతూ కడగకూడదు. దీనివల్ల జుట్టు పొడిబారి విరిగిపోతుంది.
- వారానికి కనీసం ఒక్కసారైనా నూనెతో మర్దన చేయడం వల్ల జుట్టు తేమను కోల్పోకుండా ఆరోగ్యంగా ఉంటుంది.