Foods To Kidneys: మీరు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్ మీకోసమే!
కిడ్నీకి కాలీఫ్లవర్ చాలా మేలు చేస్తుంది. ఇది విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ మంచి మూలం. ఇది కిడ్నీలను డిటాక్సిఫై చేసి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
- Author : Gopichand
Date : 05-03-2025 - 9:36 IST
Published By : Hashtagu Telugu Desk
Foods To Kidneys:ప్రస్తుత కాలంలో మనిషి ఆరోగ్యంగా ఉంటూనే ఏ పనైనా సక్రమంగా చేయగలుగుతాడు. మనిషి శరీరంలో ఏ భాగమైనా అనారోగ్యానికి గురైతే దాని ప్రభావం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇటీవల ఓ అధ్యయనంలో ఎక్కువ శాతం మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువ శాతం కూర్చొని పనిచేసే విధానంలో లోపం ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల ఆహారపు అలవాట్లు అవర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నేటి చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు (Foods To Kidneys) వచ్చే ప్రమాదం ఎక్కువవుతోంది. ఇటువంటి పరిస్థితిలో మీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన సూపర్‌ఫుడ్‌లను చేర్చుకోవడం ద్వారా మూత్రపిండాలను (కిడ్నీలను) ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. డైట్‌లో ఎలాంటి విషయాలు చేర్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
క్రాన్బెర్రీ
క్రాన్బెర్రీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ నుండి కిడ్నీలను రక్షించడంలో సహాయపడుతుంది. ఇది మూత్రపిండాలకు హాని కలిగించే మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
కాలీఫ్లవర్
కిడ్నీకి కాలీఫ్లవర్ చాలా మేలు చేస్తుంది. ఇది విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ మంచి మూలం. ఇది కిడ్నీలను డిటాక్సిఫై చేసి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Also Read: RRB JE Results: రైల్వే ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా!
వెల్లుల్లి
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ నుండి మూత్రపిండాలను రక్షించడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఉల్లిపాయలు
ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. ఇవి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఇది మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
యాపిల్స్
యాపిల్స్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మూత్రపిండాలను శుభ్రపరచడంలో.. వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. ఇది మూత్రపిండాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గమనిక: మా కథనం సమాచారం అందించడానికి మాత్రమే. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించండి.