Forgetfulness: మతిమరుపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇవి తినాల్సిందే?
ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు చాలామంది మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు.
- Author : Anshu
Date : 08-04-2023 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు చాలామంది మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు. కొంతమంది అయితే ఏదైనా వస్తువు ఎక్కడైనా పెడితే కొద్దిసేపటి తర్వాత అది ఎక్కడ పెట్టామో కూడా తెలియక ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇంకొందరు అయితే చాలా సేపు ఆలోచించిన తర్వాత గుర్తుకు వచ్చి మళ్లీ ఆ వస్తువును తిరిగి తెచ్చుకుంటూ ఉంటారు. అలా చాలావరకు మతిమరుపు సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. మతిమరుపు మానవ జీవన శైలి కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.
ఇదివరకు రోజుల్లో కేవలం మతిమరుపు సమస్య అన్నది వయసు మీద పడిన వారికి మాత్రమే కనిపించేది. కానీ రానులను ఈ సమస్య చిన్న పిల్లల నుంచి మొదలైంది. మరి మతిమరుపు సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని రకాల ఫుడ్స్ ని తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మతిమరపుతో బాధపడుతున్నవారు ఈ సమస్యను అధిగమించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. దీని కోసం చాలా ట్రీట్‌మెంట్ పద్ధతులను కూడా ఫాలో అవుతూ ఉంటారు.
అందులో భాగంగానే కొంతమంది మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మెడిసిన్స్ కి బదులుగా ఈ సమస్య నుంచి బయట పడాలంటే డైట్‌లో కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకోవడం ద్వారా తమ జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవచ్చు. మతిమరపు తగ్గి మీ జ్ఞాపకశక్తి పెరగలాంటే రోజు బాదం తినడం అలవాటు చేసుక కోవాలి. ఇందులో ఉండే ఫైబర్ మిమ్మల్ని చురుగ్గా ఉంచుతూ మీ జీర్ణవ్యవస్థను కూడా నియంత్రిస్తుంది. అలాగే అవిసె, గుమ్మడి గింజలు కూడా ఈ సమస్యకు చక్కని పరిష్కారం అందిస్తాయి.
వీటిలో విటమిన్ కె, ఎ,సి, బి6, ఐరన్, జింక్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా వాల్‌నట్, జీడిపప్పు కూడా మతిమరుపును తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. . వాల్‌నట్స్‌లో ఆల్ఫా లినోలెనిక్ అనే ఒమేగా 3 ఆమ్లాలు అధికంగా ఉండడంతో ఇవి జ్ఞాపకశక్తిని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే జీడిపప్పులో ఉండే ప్రొటీన్, విటమిన్ సి వంటి పోషకాలు మీ ఆరోగ్యానికి మేలు చేస్తూ మతిమరపు తగ్గేందుకు సహాయపడతాయి.