Fried Food: వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తింటే ఎన్ని వ్యాధులు వస్తాయో తెలుసా?
నూనెలో వేయించిన ఆహారాల సేవనం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీనివల్ల శరీరం చక్కెరను నియంత్రించలేకపోతుంది. నిరంతరం ఇలాంటి ఆహారం తీసుకోవడం టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.
- By Gopichand Published Date - 05:00 PM, Tue - 6 May 25

Fried Food: వేసవిలో వేయించిన ఆహారాన్ని (Fried Food) తినడం మానేయాలి. ఎందుకంటే ఇది మనకు వ్యాధులను తెచ్చిపెట్టవచ్చు. అందుకే మనం మన రుచి కోరికలను కొంత నియంత్రించుకోవాలి. తద్వారా వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ నివేదికలో ఎక్కువగా వేయించిన ఆహారం తినడం వల్ల కలిగే వ్యాధుల గురించి తెలుసుకుందాం. ఆరోగ్య నిపుణులు చాలాసార్లు చెబుతూనే ఉంటారు. వేయించిన ఆహారం తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా సంక్రమించవచ్చని, కానీ భారతదేశంలో ప్రజలు ఈ విషయం తెలిసినప్పటికీ రోజూ ఇలాంటి ఆహారాలను తీసుకుంటారు. అయితే ఎక్కువగా వేయించిన ఆహారాలు ఏ సీజన్‌లోనైనా మంచివి కావు. కానీ వేసవిలో వీటి దుష్ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
ఊబకాయం, బరువు పెరగడం
నిపుణులు అభిప్రాయం ప్రకారం.. వేయించిన ఆహారంలో నూనె పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో అదనపు కేలరీల రూపంలో నిల్వ ఉంటుంది. ఇది కొవ్వుగా మారి ఊబకాయాన్ని పెంచుతుంది. ఊబకాయం డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె జబ్బులను కూడా తెచ్చిపెడుతుంది.
కొలెస్ట్రాల్, గుండె ఆరోగ్యం
వేయించిన ఆహారంలో ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. మంచి కొలెస్ట్రాల్ (HDL)ని తగ్గిస్తాయి. దీనివల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఇవి గుండెపోటు, స్ట్రోక్‌కు కారణం కావచ్చు.
Also Read: Shivalik Sharma: అత్యాచారం కేసులో ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ అరెస్ట్.. ఎవరీ శివాలిక్ వర్మ?
కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం
ఎక్కువగా వేయించిన ఆహారాలు తినడం వల్ల శరీరంలో విష పదార్థాలు పెరుగుతాయి. దీనివల్ల కాలేయం, మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది. నిరంతరం ఇలాంటి ఆహారం తీసుకోవడం ఈ అవయవాలపై ఒత్తిడి పెంచుతుంది. వీటికి సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
క్యాన్సర్ ప్రమాదం
ఒకే నూనెను పదేపదే వేడి చేసి ఉపయోగిస్తే అందులో యాక్రిలమైడ్ వంటి హానికరమైన రసాయనాలు ఏర్పడతాయి. ఇది కార్సినోజెనిక్ ఎలిమెంట్. ముఖ్యంగా కడుపు, పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
డయాబెటిస్ ప్రమాదం
నూనెలో వేయించిన ఆహారాల సేవనం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీనివల్ల శరీరం చక్కెరను నియంత్రించలేకపోతుంది. నిరంతరం ఇలాంటి ఆహారం తీసుకోవడం టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.
నివారణ చర్యలు
- వేయించిన ఆహారం పరిమాణాన్ని తగ్గించండి. వారంలో 1-2 సార్లు మాత్రమే తినండి.
- ఇంట్లో తాజా నూనెలోనే వంట చేయండి. పదేపదే ఉపయోగించిన నూనెను వాడకండి.
- ఆవిరిలో వండిన, ఉడకబెట్టిన లేదా గ్రిల్ చేసిన ఆహారాలను ఎక్కువగా తినండి.
- పండ్లు, కూరగాయలు, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి.
- నిమ్మరసం, గ్రీన్ టీ, నీటిని ఎక్కువగా తాగండి.