High BP: ఇది తింటే రక్తపోటు తగ్గుతుందట.. అవి ఏంటంటే?
ప్రస్తుత కాలంలో ఎక్కువమంది బాధపడుతున్న సమస్యలలో రక్తపోటు సమస్య కూడా ఒకటి. రక్తపోటు సమస్య అనేది పలు రకాల ఆహార పదార్థాల వల్ల రకరకాల సమస్యల వల్ల కూడా వస్తూ ఉంటుంది. అయితే అధిక రక్తపోటు ఉన్నవారు, రక్తపోటు సమ
- By Anshu Published Date - 09:45 AM, Thu - 29 September 22

ప్రస్తుత కాలంలో ఎక్కువమంది బాధపడుతున్న సమస్యలలో రక్తపోటు సమస్య కూడా ఒకటి. రక్తపోటు సమస్య అనేది పలు రకాల ఆహార పదార్థాల వల్ల రకరకాల సమస్యల వల్ల కూడా వస్తూ ఉంటుంది. అయితే అధిక రక్తపోటు ఉన్నవారు, రక్తపోటు సమస్యలతో బాధపడే వారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేవిధంగా రక్తపోటు సమస్యలతో బాధపడే వారికి పెరుగు ఏ విధంగా సహాయపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రక్తపోటు గుండె సంబంధిత ప్రమాద కారకాలపై పెరుగు ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కువ బీపీ ఉన్నవారు ప్రతిరోజు వారు తినే ఆహార పదార్థాలలో పెరుగును చేర్చుకోవడం వల్ల అది బీపీని తగ్గించడంలో ఎంతో బాగా సహాయపడుతుంది అని నిపుణులు తెలిపారు. హైబీపీ లేకపోయినా కూడా పెరుగును కొంచెం పుల్లగా పులిసినట్లు అనిపించిన కూడా పెరుగును తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ప్రోబయోటిక్ రక్తపోటును చాలా వరకు నివారిస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు పక్షవాతంలాంటి ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు.
పెరుగు బీపీని తగ్గిస్తుంది. పాల ఉత్పత్తులలో కాల్షియం మెగ్నీషియం పొటాషియం అంటే అనేక రకాల సూక్ష్మ పూసకాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ పదార్థాలు బిపిని నియంత్రించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా పెరుగు తీసుకునే వారిలో రక్తపోటు సమస్య అన్నది తక్కువగా ఉంటుంది అని అధ్యయనం వెల్లడించింది. అధిక రక్తపోటుతో బాధపడేవారు పెరుగును అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల వారి రక్త పోటు స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని పలువురు శాస్త్రవేత్తలు తెలిపారు.