Summer: సమ్మర్ లో ఏటైమ్ లోవాకింగ్ చేయాలో మీకు తెలుసా
- By Balu J Published Date - 11:28 PM, Fri - 31 May 24
Summer: నడక గుండె, మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు సరైన సమయంలో నడువాలనే విషయం ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. మండే వేడిలో ఉదయం 8 గంటల ముందు నడవడం చాలా ముఖ్యం. ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, 7 నుండి 9 గంటల మధ్య మాత్రమే నడవడం మంచిది. విపరీతమైన ఉష్ణోగ్రతలలో నడవడం మానుకోవాలి. తీవ్రమైన వేడిలో, ఉదయం 5 నుండి 7 గంటల మధ్య నడవాలి. వేసవిలో అతిగా నడవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
సూర్యకాంతి లేదా వేడి తరంగాల సమయంలో పొరపాటున కూడా నడవకూడదు. నీడ ఉన్న ప్రదేశంలో నడవండి. ఇంట్లోనే వర్కవుట్లు కూడా చేయండి. చాలా హెవీ వర్కవుట్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి భారీ వ్యాయామం చేయకండి. తీవ్రమైన వ్యాయామం చేయడం మానుకోండి. మీరు వర్కవుట్ చేస్తుంటే తేలికపాటి నడక తీసుకోండి. ఉదయం లేదా సాయంత్రం 30-40 నిమిషాలు సాధారణ నడక తీసుకోండి.