HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Diabetes Can Be Avoided With These Foods

Food to Avoid Diabetes: ఈ ఆహారాలతో డయాబెటిస్ కి దూరం అవ్వచ్చు.

ప్రీ డయాబెటిస్‌ ఉన్నవారు.. డయాబెటిస్‌ ను నివారించడానికి లైఫ్‌స్టైల్‌ (Life Style),

  • Author : Maheswara Rao Nadella Date : 18-02-2023 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Diabetes Can Be Avoided With These Foods.
Diabetes Can Be Avoided With These Foods.

డయాబెటిస్‌ (Diabetes) ఒకసారి వస్తే జీవితాంతం.. దీనితో బతకాల్సిందే. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం 2050 నాటికి ముగ్గురిలో ఒకరికి డయాబెటిస్‌ బారిన వచ్చని స్పష్టం చేసింది. డయాబెటిస్‌ను సైలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిల్లర్‌ అంటారు. దీర్ఘకాలం రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో లేకపోతే.. గుండె సమస్యలు, కిడ్నీ జబ్బులు, కంటి సమస్యలు, నరాల బలహీనత వంటి సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. అందుకే, ఇది వచ్చిన తర్వాత బాధపడటం కంటే, రాకుండా జాగ్రతపడటం మంచిది. షుగర్‌ పేషెంట్స్‌ ముందుగా ‘ప్రీ డయాబెటిక్’ స్టేజ్‌ను దాటే డయాబెటిక్‌గా మారతారు.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నిర్దేశించిన విలువ‌ల క‌న్నా ఎక్కువ‌గా ఉంటే డ‌యాబెటిస్ (Diabetes) అంటారు. షుగర్‌ లెవల్స్‌ మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌కుండా కొంచెం బార్డ‌ర్ లైన్‌లో ఉన్నా, లేదా కొద్దిగా ఎక్కువ‌గా ఉన్నా దాన్ని ప్రీ డ‌యాబెటిస్ అంటారు. ప్రీ డయాబెటిస్‌ స్టేజ్‌లో ఉన్నవారు వారి లైఫ్‌స్టైల్‌, ఆహారం మీద్ద శ్రద్ధ వహించపోతే.. డయాబెటిక్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రీ డ‌యాబెటిస్ లక్షణాలు ఉన్న వ్యక్తులు.. ఆ తర్వాత స్టేజ్‌ను నివారించడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి. ప్రీ డయాబెటిక్స్‌ ఫుడ్‌ ప్లేట్‌లో ఎలాంటి ఆహారం చేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఈ కూరగాయలు తీసుకోండి

ప్రీ డ‌యాబెటిక్స్‌.. రోజుకు రెండు రకాల కూరగాయలైనా వారి డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ కూరగాయలలో ఫైబర్‌ అధికంగా ఉండేలా చూసుకోవాలి. మొక్కల ఆధారిత ఫైబర్ రక్తంలో చక్కెర పెరగకుండా కడుపు నిండుగా ఉంచుతుంది. కూలగాయలలో పోషఖకాలు పుష్కలంగా ఉంటాయి. మీ రోజువారీ.. ఆహారంలో అరకప్పు ఉడికించిన కూరగాయలు లేదా 1 కప్పు వెజిటబుల్ సలాడ్ తీసుకోండి. వీటిలో ఉప్పు వేసుకోకపోవడమే మంచిది.

  • కారెట్
  • క్యాప్సికమ్
  • బ్రోకలీ
  • ఆకుకూరలు
  • కాలే వంటి కూరగాయలు తీసుకోండి.

ఈ కూరగాయలు తక్కువగా తీసుకోండి

మీ ఆహారంలో బంగాళదుంపలు, చిలగడదుంపలు, మొక్కజొన్న, గుమ్మడికాయ వంటి కూరగాయలను.. తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీ డైట్‌లో నాలుగింట ఒక వంతు మాత్రమే తినాలి. వీటిలో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.

ఈ పండ్లు తినండి

పండ్లలో సహజమైన చక్కెరలు ఉంటాయి. పండ్లలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. రోజుకు రెండు నుంచి మూడు సర్వింగ్స్‌ పండ్లు తీసుకోండి. మీ డైట్‌లో బెర్రీ, కివి, పుచ్చకాయ, సిట్రస్‌ పండ్లు, అవకాడో తీసుకోండి.

తృణధాన్యాలు తీసుకోండి

ప్రీ డ‌యాబెటిక్స్‌ ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆహారంలో తృణధాన్యాలు చేర్చుకోండి. తృణధాన్యాలలో ఫైబర్‌, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్‌ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది. మీ డైట్‌లో ఓట్స్,బ్రౌన్ రైస్, ఓల్‌ వీట్‌, క్వినోవా, రెడ్‌ రైస్‌ తీసుకోండి.

నట్స్‌, విత్తనాలు తీసుకోవచ్చా?

నట్స్‌, విత్తనాలలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. వీటిలో క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రీ డయాబెటిక్స్‌ నట్స్‌, విత్తనాలు మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆహారంలో వాల్‌నట్స్‌, పిస్తా, వేరుశెనగ, పొద్దుతిరుగుడు విత్తనాలు, జీడిపప్పు, బాదం తీసుకోండి.

ప్రొటీన్‌ ఆహారం తీసుకోండి

మీ ఆహారంలో ప్రొటీన్‌ ఎక్కువగా చేర్చుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. ప్రోటీన్‌లు.. కార్బోహైడ్రేట్లు రక్తప్రవాహంలోకి నెమ్మదిగా వెళ్లేలా సహాయపడతాయి. మీకు డయాబెటిస్‌ రాకుండా ఉండాలంటే.. ప్యాటీ ఫిష్‌, సీఫుడ్, బీన్స్, పప్పులు. మొక్కల ఆధారిత ప్రోటీన్, గుడ్డు, తక్కువ కొవ్వు ఉన్నపాలు, లీన్‌ మాంసాలు తీసుకోండి.

Also Read:  Acne: మొటిమలంటే భయమా? ఇలా నివారించుకోవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • avoid
  • benefits
  • Diabetes
  • food
  • health
  • Life Style
  • Sugar Patients

Related News

Why do Indians love spicy foods...?

Spicy Food: ఇండియన్లు స్పైసీ ఫుడ్స్‌ను ఎందుకు ఇష్టపడతారు…?

భారతీయ వంటకాలు ఎక్కువగా స్పైసీగా ఉంటాయి. ఇక్కడి వంటకాలు మసాలాతో నిండి ఉంటాయి. స్పైసీ కంటెంట్ విషయంలో అస్సలు రాజీపడరు. కారంగా ఉన్న ఆహారాన్నే భారతీయులు ఇష్టపడుతుంటారు. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. వాస్తవానికి మసాలా పరిమాణం సాధారణం కంటే తక్కువగా ఉన్నట్లయితే… ఆహారం చప్పగా ఉంటుంది. ప్రాథమిక ప్రమాణాలతో పోల్చితే సాధారణం కంటే చాలా ఎక్కువ. అయితే స్పైసీ ఫుడ్స్ ఎక

  • Suffering from gastric problems? Do this, and your problem will vanish in a jiffy.

    Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేస్తే మీ సమస్య చిటికెలో మాయం!

Latest News

  • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

  • LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Andhra Pradesh: పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ, విషెన్ హలంబగే గొడవపై స్పందించిన క్రికెట్‌ బోర్డు.. శ్రీలంక క్రికెటర్‌కే భారీ జరిమానా

  • Pawan Kalyan: నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. అభిమాని చివరి కోరిక తీర్చనున్న జనసేనాని!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd