HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Self Love Is Real Empowerment Make These 5 Promises To Yourself On Womens Day

మహిళా దినోత్సవం.. ఈ వాగ్దానాలు చేసుకోండి!

అద్దంలో మిమ్మల్ని చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మీలోని మంచిని ప్రతిసారీ మెచ్చుకోండి. మీ చిన్న చిన్న తప్పులను మన్నించుకోండి.

  • Author : Gopi Date : 02-03-2026 - 3:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Women's Day
Women's Day

Women’s Day: ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. ఈ రోజు కేవలం మహిళల విజయాలను వేడుకగా జరుపుకోవడమే కాదు తమను తాము అర్థం చేసుకుని, అభినందించుకోవడానికి ఒక ప్రత్యేక సందర్భం. ఒకటి కాదు అనేక బాధ్యతలను మోస్తున్న ప్రతి మహిళ కోసం ఈ రోజు. నిత్య జీవితపు బాధ్యతల మధ్య మహిళలు తరచుగా తమ అవసరాలను విస్మరిస్తుంటారు. అందుకే ‘సెల్ఫ్ లవ్’ లేదా మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన సాధికారతకు ఆరంభం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని మీరు మరింత దృఢంగా, ఆత్మవిశ్వాసంతో, సంతోషంగా ఉంచుకోవడానికి మీకు మీరుగా కొన్ని వాగ్దానాలు చేసుకుంటే ఎలా ఉంటుంది? అందుకు సహాయపడే 5 వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి.

మహిళా దినోత్సవం సందర్భంగా మీకు మీరుగా చేసుకోదగ్గ 5 వాగ్దానాలు

మిమ్మల్ని మీరు ప్రాధాన్యతగా ఉంచుకోవాలనే వాగ్దానం

మహిళలు తమ జీవితంలో అనేక పాత్రలను పోషిస్తుంటారు. ఈ క్రమంలో వారు తమ గురించి ఆలోచించడం మర్చిపోతారు. ఇతరుల అవసరాలను ముందుగా చూడటం మంచిదే. కానీ మీ ఆరోగ్యం, సంతోషం, విశ్రాంతిని నిర్లక్ష్యం చేయడం సరికాదు. మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈరోజు మీరు మీకు వాగ్దానం చేయండి.

Also Read: HPV Vaccine: HPV వ్యాక్సిన్ సేఫ్ కాదా? కేంద్రం ఏంచెపుతుంది?

‘వద్దు’ అని చెప్పడం నేర్చుకోండి

మహిళలకు ఎవరికీ ‘నో’ (వద్దు) అని చెప్పలేకపోవడం ఒక సహజ లక్షణం. కానీ ప్రతిదానికి ‘అవును’ అని చెప్పడం మీ బాధ్యత కాదు. అవసరమైన చోట స్పష్టంగా వినయంగా ‘వద్దు’ అని చెప్పడం నేర్చుకోండి. ఇది మీ హద్దులను నిర్ణయించడమే కాకుండా మీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది.

ఇతరులతో పోల్చుకోవద్దు

మీరు ఎప్పుడూ మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవద్దు. మీకున్న వాటితో సంతోషంగా ఉండండి. మీ ప్రత్యేకతలను గుర్తించండి. మిమ్మల్ని మీరు గతం కంటే మెరుగ్గా తీర్చిదిద్దుకోవడంపై దృష్టి పెట్టండి. జీవితంలో ముందుకు సాగుతూ సంతోషంగా ఉండటం నేర్చుకోండి.

కలలు కనడం మర్చిపోవద్దు

మహిళలు అందరి కోసం జీవిస్తుంటారు. కానీ మీ కలల గురించి కూడా ఆలోచించండి. కలలు కనడం ఎప్పుడూ ఆపకండి. అది కెరీర్ కావచ్చు. వ్యాపారం కావచ్చు లేదా మీకు ఇష్టమైన ఏదైనా హాబీ కావచ్చు… వాటిని కేవలం ఆలోచనలకే పరిమితం చేయకండి. మీ లక్ష్యాల వైపు చిన్న చిన్న అడుగులు వేయడం ప్రారంభించండి.

మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి

అద్దంలో మిమ్మల్ని చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మీలోని మంచిని ప్రతిసారీ మెచ్చుకోండి. మీ చిన్న చిన్న తప్పులను మన్నించుకోండి. మీ ప్రతి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి. గుర్తుంచుకోండి. మీరు మిమ్మల్ని గౌరవించుకున్నప్పుడే ప్రపంచం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Empowerment
  • Learn To Love
  • lifestyle
  • Women's Day 2026
  • womens day
  • Womens Day Special

Related News

    Latest News

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd