Osteo Arthritis: ఉదయం పూట మీ చేతులు గట్టిగా మరియు నొప్పిగా ఉన్నాయా?
ఎముకల (Bones) చివర్ల మృదులాస్థి క్షీణించినప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది.
- Author : Maheswara Rao Nadella
Date : 20-02-2023 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలో ఆస్టియో ఆర్థరైటిస్ (Osteo Arthritis) కూడా ఒకటి. మహిళల్లో ఎక్కువగా ఈ సమస్య ఉంది. దీనికి కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే, ఎక్కువ బువు కారణంగా ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎంత బరువు ఉంటే అంతే ప్రమాదం ఉంటుంది. పెరిగిన బరువు కాళ్ళపై ఒత్తిడిని పెంచి సమస్యని తీవ్రంగా మారుస్తుంది. అదే విధంగా కొవ్వు కణజాలం, మీ కీళ్ళలో, చుట్టుపక్కల హానికరమైన మంటను కలిగించే ప్రోటీన్స్‌ని ఉత్పత్తి చేస్తుంది.
కొన్ని కారణాలు:
W.H.O. ప్రకారం:
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (W.H.O.) ప్రపంచ వ్యాప్తంగా 60 ఏళ్ళు పైబడిన స్త్రీ, పురుషులిద్దరూ ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. ఇది సాధారణ సమస్య. ఎక్కువగా చేతులు, మోకాళ్ళపై ఎఫెక్ట్ చూపించే ఈ సమస్యని తగ్గించుకునేందుకు కొన్ని లక్షణాల గురించి తెలుసుకుని ట్రీట్‌మెంట్ తీసుకోవాలని మాయో క్లినిక్ చెబుతోంది.
సమస్య ఉంటే:
ఇటువంటి ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉంటే ఉదయం స్టిఫ్‌గా మారతాయి జాయింట్స్. ఆస్టియో ఆర్థరైటిస్ కారణంగా నొప్పి, స్టిఫ్‌నెస్, వాపు, చేతుల్లో కీళ్ళ సున్నితత్వం ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు చేతి నొప్పి ఎక్కువగా ఉండడం, కొన్ని సార్లు స్పర్శ లేకపోవడం ఉంటుంది. దీని వల్ల వేళ్ళు వంగిపోవడం జరుగుతుంది. ఆస్టియోఫైట్స్ అని కూడా పిలిచే ఈ సమస్య కీళ్ళలో ఈ పరిస్థితి అదనపు ఎముకలు పెరిగేలా చేస్తుంది.
ఆస్టియో ఆర్థరైటిస్ (Osteo Arthritis) లక్షణాలు:
ఈ సమస్య లక్షణాలు ఒక్కసారిగా కనిపించవు. రోజులు మారే కొద్దీ పెరుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- కీళ్ళలో నొప్పి
- దృఢత్వం
- సున్నితత్వం
- పట్టు కోల్పోవడం
- మంటగా అనిపించడం
- వాపు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Precautions):
కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి కొద్దిగా రిలీఫ్ పొందొచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
- యాక్టివ్‌గా ఉండడం
- సరైన బరువు
- కొన్ని ట్రీట్‌మెంట్స్ తీసుకోవడం
- వర్కౌట్స్
వర్కౌట్స్ (Work Outs):
ఎవరికి వస్తుందంటే:
యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఎవరికి వస్తుందో చూద్దాం.
- వృద్ధాప్యం
- ఊబకాయం
50 ఏళ్ళు పైబడడం, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి కుటుంబంలో ఆల్రెడీ ఈ సమస్య ఉన్నవారికి కీళ్ళ గాయాలు అయినవారికి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. ఈ సమస్య వచ్చాక కాలక్రమేణా పెరుగుతుంది. గమనించకుండా వదిలేస్తే రోజువారీ పనులు కష్టంగా ఉంటాయి.
ట్రీట్‌మెంట్ (Treatment):
సమస్య లక్షణాలు ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతుంటే డాక్టర్‌ని సంప్రదించాలి. మిమ్మల్ని పరీక్షించిన డాక్టర్స్ సమస్య ఎంతలా ఉందో చూసి నొప్పుల ప్రభావాన్ని బట్టి మీకు మంచి ట్రీట్‌మెంట్‌ని సజెస్ట చేస్తారు. దీంతో పాటు హెల్దీ లైఫ్‌స్టైల్ చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి.
Also Read: Delivery Agent: ఐఫోన్ కి డబ్బులు లేవని డెలివరీ ఏజెంట్ ని చంపేసిన ఓ వ్యక్తి