vastu tips: బాత్రూంలో ఈ వస్తువులు ఉన్నాయా.. అయితే వెంటనే వాటిని తీసేయండి?
మామూలుగా మనం వాస్తు విషయాలలో తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. వాటి కారణంగా లేని పోని సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా
- By Nakshatra Published Date - 01:45 PM, Tue - 30 January 24
మామూలుగా మనం వాస్తు విషయాలలో తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. వాటి కారణంగా లేని పోని సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు మానసిక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే వాస్తు శాస్త్ర ప్రకారం మనం పాటించాల్సిన వాటిలో బాత్రూంలో ఉంచాల్సిన వస్తువులు కూడా ఒకటి. కొంతమంది బాత్రూంలో ఏవి పడితే అవి వస్తువులను పెడుతూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకండి. మరి బాత్రూంలో ఎలాంటి వస్తువులు ఉంచకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాత్రూం వాస్తు విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.
సంతోషం, శ్రేయస్సు కొనసాగించాలంటే బాత్రూంలో ఉండాల్సిన వస్తువులపైన కచ్చితంగా అవగాహన ఉండాలి. ఉండకూడని వస్తువులు బాత్రూంలో ఉంటే వెంటనే తొలగించాలి. అసలు బాత్రూంలో ఎటువంటి వస్తువులు ఉండకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాత్రూంలో ఎప్పుడు విరిగిపోయిన అద్దాలు ఉండకూడదు. విరిగిపోయిన అద్దాలు, పగిలిపోయిన అద్దాలు బాత్రూంలో ఉంటే అవి ప్రతికూలతలను సృష్టిస్తాయి. బాత్రూంలో ఎప్పుడు బకెట్లు ఖాళీగా ఉంచకూడదు. ఖాళీ అయిన బకెట్ ను బోర్లించి పెట్టాలి. ఖాళీగా బకెట్ ఉంటే అది కూడా ఇంట్లో డబ్బులను ఖాళీ చేస్తుంది. ఇక విరిగిపోయిన, పగిలిపోయిన బకెట్లు, మగ్గులు బాత్రూంలో పొరపాటున కూడా ఉంచకూడదు.
బాత్రూంలో చాలా మంది మొక్కలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే బాత్రూంలో మొక్కలు పెట్టడం ఏ మాత్రం మంచిది కాదు. బాత్రూంలో మొక్కలు ఎండిపోయినవి కూడా ఉండకూడదు. దీనివల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది. బాత్రూంలను చాలా మంది అందంగా ఉంచడం కోసం రకరకాల చిత్రాలతో డెకరేట్ చేస్తారు. ఇక చినిగిపోయిన చిత్రాలను బాత్రూంలో పొరపాటున కూడా ఉంచకూడదు. అలా ఉంటే కుటుంబ కలహాలు వస్తాయి. బాత్రూంలో ట్యాప్ ఎప్పుడు లీక్ కాకూడదు. ఒకవేళ బాత్రూంలో ట్యాప్ లీక్ అయితే అది ప్రతికూల శక్తిని వ్యాపింప చేస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా చెడుగా ప్రభావితమవుతుంది. బాత్రూంలో చాలామంది మురికి బట్టలు, తడి బట్టలు వదిలేస్తుంటారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదు. బాత్రూంలో మురికి బట్టలు, తడి బట్టలు ఉంటే వాస్తు దోషంతో పాటు సూర్య దోషం కూడా కలుగుతుంది. తీవ్రమైన అనారోగ్యాల బారిన పడి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి బాత్రూంలో వస్తువుల విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.
Tags
Related News
House Cleaning : బ్యాడ్ లక్ పోవాలంటే ఇంటిని క్లీన్ చేసుకోవలసిందే..
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వలన మనం శారీరకంగానూ, మానసికంగానూ ఆనందంగాను ఉంటాము.