HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >The Only Ancient Temple Of Sun God In Andhra Arasavalli

Arasavalli : ఆంధ్రాలో గల ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయం

దేశంలోని ప్రసిద్ధ సూర్య భగవానుడి ఆలయాల్లో (Sun Temple) ఒకటిగా, రాష్ట్రంలోనే ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయంగా ప్రసిద్ధి చెందిన

  • Author : Vamsi Chowdary Korata Date : 25-12-2022 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Arasavalli Sun Temple
Arasavalli Sun Temple

దేశంలోని ప్రసిద్ధ సూర్య భగవానుడి ఆలయాల్లో (Sun Temple) ఒకటిగా, రాష్ట్రంలోనే ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయంగా ప్రసిద్ధి చెందిన అరసవల్లి (Arasavalli) ఆలయ విశేషాలు, ప్రత్యేకతలు, అక్కడికి ఎలా చేరుకోవాలి? అనే వివరాలు తెలుసుకుందాం రండి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి, మహా శివుడికి సంబంధించి శ్రీ కాళహస్తి, శ్రీ శైలం, వినాయకుడికి సంబంధించి కాణిపాకం ఇలా ప్రతి దైవానికి సంబంధించి దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన ప్రాచీన దేవాలయాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. వీటితో పాటు సమస్త లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడి అరుదైన ఆలయం కూడా ఒకటి ఇక్కడ ఉంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయంగా, దేశంలోని అరుదైన సూర్య భగవానుడి ఆలయాల్లో ప్రముఖమైనదిగా ప్రసిద్ధి చెందింది.

ఆలయ విశిష్టత:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణానికి 2.5 కిలోమీటర్ల దూరంలో అరసవల్లిలో (Arasavalli) శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆరాధ్య దైవంగా ఇక్కడి సూర్య భగవానున్ని పూజిస్తారు. ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ సూర్య నారాయణ స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది.

ప్రతి ఏటా రెండు పర్యాయాలు సూర్యోదయాన సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు పాదాలను తాకేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ దృశ్యం భక్తుల్లో ఆనంద పారవశ్యాన్ని, ఆధ్యాత్మికతను నింపుతుంది. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు అశేషంగా తరలివస్తారు. దేవస్థానం ప్రాంగణంలోని అనివెట్టి మండపం, సుదర్శన ద్వారం మధ్యలో సూర్యుని తొలికిరణాలు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును తాకి గొప్ప తేజస్సును అందిస్తాయి. ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లో, అక్టోబర్ 1, 2, 3, 4 తారీఖుల్లో ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ఈ అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే అన్నీ పాపాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది.

వైభవంగా రధసప్తమి వేడుకలు:

అరసవిల్లి (Arasavalli) శ్రీ సూర్య నారాయణ స్వామి వారికి రధ సప్తమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజు కోసం భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. వేద పండితులు స్వామి వారికి వేద మంత్రోచ్ఛారణల నడుమ మంగళ ధ్వనులతో మహా క్షీరాభిషేక సేవను నిర్వహిస్తారు. అరసవల్లి (Arasavalli) సూర్య భగవానుడికి విశేషమైన పర్వదినం ఇది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు, ఆదిత్యుని దర్శనం చేసుకునేందుకు లక్షలాది సంఖ్యలో రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు తండోప తండాలుగా తరలివస్తారు.

శ్రీకాకుళం పట్టణంకు 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం ఉంది. అరసవల్లి (Arasavalli) ఆలయాన్ని సందర్శించే భక్తులు ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా సందర్శించి వెళుతుంటారు. ప్రపంచంలోనే విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక స్వయంభు ఆలయం ఇది. ఈ ఆలయంలో నిత్యాభిషేకాలు జరుగుతుంటాయి. ప్రపంచంలో దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న రెండవ ఆలయం శ్రీకూర్మం. ఇక్కడికి వారణాశికి వెళ్లడానికి సొరంగ మార్గం ఉందని, ప్రస్తుతం దీనిని మూసివేసినట్లు చెబుతారు. వారణాసి మాదిరిగానే చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించే మోక్ష స్థానంగా శ్రీకూర్మంకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

అరసవిల్లికు ఎలా వెళ్లాలి?

రోడ్డు మార్గం:

శ్రీకాకుళంకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి విరివిగా బస్సు రవాణా ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి నేరుగా బస్సు సదుపాయం లేని వారు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ కు చేరుకుని అక్కడికి నుంచి శ్రీకాకుళంకు బస్సులో చేరుకోవచ్చు. విశాఖ నుంచి శ్రీకాకుళంకు ప్రతి 30 నిమిషాలకు బస్సులు నడుస్తుంటాయి. శ్రీకాకుళం పట్టణం నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయానికి అనేక ఆటోలు, ప్రైవేటు వాహనాలు, బస్సులు వెళ్తుంటాయి.

వాయు మార్గం:

శ్రీకాకుళంకు సమీపంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విశాఖ నుంచి ఇక్కడికి 116 కిలోమీటర్లు. సందర్శకులు బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాల ద్వారా శ్రీకాకుళం చేరుకోవచ్చు.

రైలు మార్గం:

శ్రీకాకుళం పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్ నుంచి శ్రీకాకుళంకు బస్సులు, ఆటోలు ప్రతి రోజూ నడుస్తుంటాయి.

Also Read:  Lord Vishnu : విష్ణువు కూర్మావతారంలో ఉన్న ఏకైక ఆలయం ఇది..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra
  • andhra pradesh
  • ap
  • Arasavalli
  • devotional
  • south
  • sun
  • Sun God
  • temple

Related News

State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

Elite Eco Energies : ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన రంగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటూ, ప్రముఖ ఎనర్జీ బ్రాండ్ ‘పూర్‌పవర్’ (PoorPower) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గూనుపూడిలో తన అత్యాధునిక షోరూమ్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ (Elite Eco Energies) పేరుతో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ నూతన సదుపాయం కేవలం ఒక సాధారణ రిటైల్ విక్రయ కేంద్రంగానే కాకుండా, దక్షిణ భారతదేశం

  • Why should a husband and wife stay apart during the month of Ashadha?

    Ashada Masam 2026: ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఎందుకు దూరంగా ఉండాలి?

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • Why is *Thamboolam* (betel leaves and areca nuts) offered? On what occasions is it given? What is its significance?

    Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • Vip Break Darshan For 116 Y

    TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

  • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd