HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >The Idea Behind Ekadashi Fasting Is

Vaikuntha Ekadashi : ఏకాదశి ఉపవాసం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటంటే…

స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకుని ఉపవాసం, జాగరణ (Vigilance) చేసేవారి సంఖ్య ఎక్కువే. అయితే

  • By Vamsi Chowdary Korata Published Date - 05:30 AM, Sat - 31 December 22
  • daily-hunt
Vaikuntha Ekadashi
Vaikuntha Ekadashi

2023 జనవరి 2 సోమవారం ముక్కోటి ఏకాదశి (Vaikuntha Ekadashi). ఈ రోజు వైష్ణవ ఆలయాలన్నీ కళకళలాడిపోతుంటాయి. స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకుని ఉపవాసం, జాగరణ చేసేవారి సంఖ్య ఎక్కువే. అయితే ఈ రోజు ఉపవాసం ఎందుకుండాలి. దేవుడి పేరుతో చేసే ఉపవాసం అయినా, దీక్ష అయినా అది దేవుడికోసం అనుకుంటే పొరపాటే. దాని వెనుక ఆరోగ్య రహస్యాలెన్నో ఉంటాయి.  ముక్కోటి ఏకాదశి (Vaikuntha Ekadashi) రోజు చేసే ఉపవాసం వెనుకున్న ఆంతర్యం కూడా అదే.

ఒక్కో ఏకాదశికి (Ekadashi) ఒక్కో ప్రత్యేకత:

🔱 ఆషాఢమాసం నుంచి  పుష్యమాసం వరకూ వచ్చే ఏకాదశిల్లో ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఉంది.

🔱 చాతుర్మాస దీక్ష ప్రారంభించే వారు ఆషాఢ ఏకాదశి నుంచి మొదలెడతారు. అదే తొలి ఏకాదశి.

🔱 శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదైకాదశి అంటారు. అంటే సంతానంకోసం వ్రతం చేసేవారు ఈ ఏకాదశి నుంచి మొదలు పెట్టి  ఏడాది పాటు ఏకాదశి వ్రతం చేస్తారు.

🔱 భాద్రపద శుద్ధ ఏకాదశి దీనిని పరివర్తనేకాదశి అంటారు. ఈ ఏకాదశిరోజు విష్ణువు ఎడమనుంచి కుడివైపుకు తిరిగి పడుకుంటాడని అంటారు.

🔱 ఆశ్వయుజ శుద్ధ ఏకాదశికి పాశాంకుశైకాదశి అంటారు. ఈ వ్రతం చేసినవారికి నరకప్రాప్తి లేకుండా ఉంటుందని చెబుతారు.

🔱 కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన ఏకాదశి అంటారు.

🔱 పుష్యమాసంలో వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఈ రోజున ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తాడని అందుకే ముక్కోటి ఏకాదశి అంటారని చెబుతారు. అత్యంత పవిత్రమైన రోజుగా భావించి ఉపవాసాలు, జాగరణలు చేస్తారు.

ఉపవాసం ఎందుకుండాలి:

ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉందన్న విషయం అర్థమైతే..చేసే పూజల్లో, నోచే నోముల్లో చాదస్తం కనిపించదేమో. ఇక ముక్కోటి ఏకాదశి రోజు ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. ఏకాదశి తిధి రోజు చంద్రుడు,సూర్యుడు,భూమి మధ్య ఉండే దూరం,సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని, అరుగుదల మందగిస్తుందని అందుకే ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని చెబుతారు. సాధారణంగా మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు. కొంత భాగం మిగిలిపోతుంది. అది మురిగిపోయి రోగాలకు కారణమవుతుంది. ప్రతి ఏకాదశికి అంటే 11 రోజులకోసారి ఉపవాసం ఉండడం వల్ల వ్యర్థ్యాలు బయటకు పోయి శరీరం శుభ్రపడుతుంది. భక్తి కి భక్తి ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట.

ఇంద్రియాలపై నియంత్రణ కోసమే ఉపవాసం:

దేహమే దేవాలయమని శాస్త్రం చెబుతుంది.  మన మనసులోనే ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం లాంటి సాధనల ద్వారా ఆరాధించడమని అర్థం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు,  మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన రాక్షసుడిని జయించి.. జ్ఞానాన్ని,ముక్తిని పొందాలంటే ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని చెబుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉపవాసం ద్వారా మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి, మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ ఏడవదైన సహస్రార చక్రంలో సహస్రకమలంలో పరమాత్మను దర్శించి బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలో ఐక్యం చేయడమే.

Also Read:  Kiratha Varahi Mantram : అతి శక్తివంతమైన కిరాత వారాహి మంత్రం..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • ekadashi
  • Fasting
  • health
  • Life Style

Related News

Talcum Powder

Talcum Powder: టాల్కమ్ పౌడర్‌తో పిల్లలకు ప్రమాదమా?

చిన్న పిల్ల‌ల వైద్యుల ప్ర‌కారం.. టాల్కమ్ పౌడర్ వినియోగం పిల్లలకు ప్రమాదకరమని చెబుతున్నారు. ఇది సురక్షితమైన ఉత్పత్తి అని మీరు ఇప్పటివరకు భావించి ఉంటే ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది.

  • Sleep Disorders

    Sleep Disorders: యువత‌కు బిగ్ అల‌ర్ట్‌.. మీలో కూడా ఈ స‌మ‌స్య ఉందా?

  • Leg Sprain

    Leg Sprain: మీ కాలు బెణికితే వెంట‌నే ఈ రెండు ప‌నులు చేయండి!

  • Glowing Skin

    Glowing Skin: మెరిసే చర్మం కోసం పాటించాల్సిన ప్రత్యేక చిట్కాలీవే!

Latest News

  • Kiran Navgire: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా క్రికెట‌ర్‌!

  • Garib-Rath Train: త‌ప్పిన పెను ప్ర‌మాదం.. రైలులో అగ్నిప్ర‌మాదం!

  • Afghanistan-Pakistan War: విషాదం.. ముగ్గురు క్రికెట‌ర్లు దుర్మ‌ర‌ణం!

  • Pawan Kalyan Next Film : పవన్-లోకేశ్ కాంబోలో సినిమా?

  • Telangana Bandh : తెలంగాణ బంద్.. ఎవరిపై ఈ పోరాటం?

Trending News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd