HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Raghunath Temple Reopens In Srinagar After 36 Years

Raghunath Temple: 36 ఏళ్ల తర్వాత శ్రీనగర్‌లో తెరుచుకున్న రఘునాథ మందిరం

  • Author : Vamsi Chowdary Korata Date : 27-03-2026 - 9:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
After decades of silence, Raghunath Temple in Srinagar, J&K has finally been reopened for devotees after 36 years.
After decades of silence, Raghunath Temple in Srinagar, J&K has finally been reopened for devotees after 36 years.

కశ్మీర్ లోయలో మూడున్నర దశాబ్దాల క్రితం మూతపడిన ఓ చారిత్రక హిందూ దేవాలయం తిరిగి తెరుచుకుంది. ఉగ్రవాదం కారణంగా మూతపడిన శ్రీనగర్‌లోని హబ్బాకడల్ ప్రాంతంలో ఉన్న రఘునాథ్ మందిరాన్ని రామ నవమి పర్వదినం సందర్భంగా పునఃప్రారంభించారు. 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఈ వేడుకల్లో కశ్మీరీ పండిట్లు, స్థానిక ముస్లింలు, పౌర, పోలీసు శాఖల అధికారులు పాల్గొని మత సామరస్యాన్ని చాటారు.

ఈ సందర్భంగా శ్రీనగర్ డిప్యూటీ కమిషనర్ అక్షయ్ లబ్రూ మాట్లాడుతూ.. “చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ రామ నవమి వేడుకలు జరుపుకుంటున్నాం. పౌర యంత్రాంగం, పోలీసులు, స్థానికులు, ఆలయ నిర్వాహకులు అందరి సహకారంతో ఇది సాధ్యమైంది” అని తెలిపారు. ఈ నెలలో నవరాత్రి, నవ్రోజ్‌, ఇప్పుడు రామ నవమి.. అన్ని పండుగలనూ సామరస్యపూర్వక వాతావరణంలో జరుపుకున్నామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఆలయ నేపథ్యం.. పునరుద్ధరణ

జమ్మూలోని రఘునాథ్ ఆలయం నమూనాలో 1857లో మహారాజా గులాబ్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించారు. 1990ల ప్రారంభంలో కశ్మీర్ లోయలో ఉగ్రవాదం పెరిగిపోయి, కశ్మీరీ పండిట్లు భారీగా వలస వెళ్లినప్పుడు అనేక ఆలయాలతో పాటు ఈ రఘునాథ్ మందిరాన్ని కూడా మూసివేశారు. కొన్నేళ్లుగా శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయ పునరుద్ధరణ పనులను 2020లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద చేపట్టారు. జమ్మూకశ్మీర్ పర్యాటక శాఖ, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ (INTACH) సహకారంతో పునరుద్ధరణ పనులు పూర్తిచేశారు.

స్థానికుల హర్షం

ఆలయం తిరిగి తెరుచుకోవడంపై స్థానికులు, ముఖ్యంగా ముస్లిం సమాజం హర్షం వ్యక్తం చేసింది. “ఈ ఆలయం మా సంస్కృతి, వారసత్వంలో భాగం. రామ నవమికి మళ్లీ తెరవడం ఆనందంగా ఉంది. మా కశ్మీరీ పండిట్ సోదరులు కూడా లోయకు తిరిగి వచ్చి గతంలోలా మాతో కలిసి జీవించాలని కోరుకుంటున్నాను” అని సమీపంలోని ఫతేకడల్ వాసి అబ్దుల్ రషీద్ (72) అన్నారు.

ఆలయ కమిటీ అధ్యక్షుడు భరత్ రైనా మాట్లాడుతూ.. “ఈ వేడుకలు హిందూ, ముస్లింల మధ్య సోదరభావాన్ని చూపిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా మేము ఇక్కడే ఉన్నాం, మా ముస్లిం సోదరులు మాకు అండగా నిలిచారు” అని చెప్పారు. మూడు దశాబ్దాల తర్వాత రఘునాథ్ ఆలయాన్ని తెరవగలిగినప్పుడు, మూతపడిన ఇతర ఆలయాలను కూడా పునరుద్ధరించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే నెలల్లో ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని, కశ్మీరీ పండిట్లు లోయకు తిరిగి రావడానికి ఇది సరైన సమయమనిపిస్తోందని ఆయన అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gulab Singh
  • hindu temple
  • Jammu-Srinagar
  • kashmir
  • kashmiri pandits
  • Raghunath Temple
  • Ram Navami
  • Srinagar

Related News

Panakam And Vadapappu

Ram Navami 2026: శ్రీరామనవమి రోజున ప్రసాదంగా పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడతారు? దీని వెనుక ఆరోగ్య రహస్యం, తయారీ విధానం మీ కోసం.

Panakam And Vadapappu  శ్రీరామనవమి పండుగ రోజు దేవుడికి పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదాలు సమర్పించడం వెనుక ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సాధారణంగా శ్రీరామనవమి పండుగ వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముడి పూజ తర్వాత కొత్తకుండలో మిరియాలు, యాలకులు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి అందరికీ పంచి పెడతారు. అయితే భగవంతుడికి

    Latest News

    • Gas Shortage : దేశ ప్రజలకు మరో తీపి కబురు తెలిపిన కేంద్రం

    • Ram Charan: ‘పెద్ది’ గ్లింప్స్ వచ్చేసింది.. కుస్తీ వీరుడిగా రామ్ చరణ్ మాస్ అవతార్

    • Amaravati Fire Accident : పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ..కాల్చింది అతడే !!

    • LPG Tanker: గుజరాత్‌కు చేరిన ‘జగ్ వసంత్’ ఎల్‌పీజీ నౌక

    • Minister Romance : లీకైన మంత్రి రాసలీలలు.. షాక్ లో పార్టీ శ్రేణులు

    Trending News

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

      • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

      • War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

      • Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

      • Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd