Divine Flowers: ఏ దేవుడికి ఏ పుష్పాలతో పూజ చేస్తే మంచిదో తెలుసా?
సాధారణంగా హిందువులు ఇంట్లో దేవుళ్లకు కొందరు నిత్య దీపారాధన చేస్తే ఇంకొందరు వారంలో రెండు మూడు రోజుల్లో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇంక
- By Nakshatra Published Date - 08:10 PM, Tue - 20 June 23
సాధారణంగా హిందువులు ఇంట్లో దేవుళ్లకు కొందరు నిత్య దీపారాధన చేస్తే ఇంకొందరు వారంలో రెండు మూడు రోజుల్లో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇంకొందరు దేవుడికి దీపం పెట్టనిదే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టని వారు చాలామంది ఉన్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ చాలామంది దేవుళ్ళ పెట్టే పూల విషయంలో కాస్త అయోమయ పడుతూ ఉంటారు. ఏ దేవుడికి ఏ పూలు అంటే ఇష్టం? ఏ దేవుడిని ఎటువంటి పూలతో పూజించాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మరి ఏ దేవుడిని ఏ పూలతో పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శివుడు…. మాములుగా పరమేశ్వరుడికి ఉమ్మెత్త పూలు అంటే చాలా ఇష్టం. మహాశివుడు గరళం తాగినప్పుడు ఉమ్మెత్త అతని ఛాతీపై దర్శనమిస్తుందని అంటారు. వాటితో పూజ చేస్తే అహం, శత్రుత్వం వంటి గుణాలు నశించి ప్రశాంతమైన జీవితం సొంతమవుతుంది.
కాళీ మాతకు.. కాళీ మాతకు ఎర్ర మందారం పూలు అంటే చాలా ఇష్టం. ఆ రంగు కాళీమాతలోని ధైర్యాన్ని, సాహసాన్ని సూచిస్తాయి. 108 ఎర్ర మందారాలతో మాల కట్టి కాళీ మాత మెడలో వేసి నమస్కరిస్తే కోరిక కోరికలు తీరుతాయి.
లక్ష్మీ దేవి… ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీ దేవికి కలువ పువ్వులు అంటే చాలాఇష్టం. అందుకే ఆమె ఎప్పుడు కలువ పువ్వులోనే కూర్చుని ఉంటుంది. ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కమలమే.
వినాయకుడు.. విఘ్నేశ్వరుడికి ఎరుపు నారింజల రంగులో ఉండే బంతిపూలు అంటే చాలా ఇష్టం. బంతిపూలు పాజిటివిటీని పెంచుతాయి. గణేష్ కి ఎర్ర బంతిపూలతో మాల కట్టి పూజ చేయడం వల్ల మీ కష్టాలు తీరుతాయి.
మహా విష్ణువు… మహావిష్ణువుకి పారిజాత పూలు అంటే చాలా ఇష్టం. అందుకోసం పారిజాత పూలను నేరుగా చెట్ల నుంచి కోయకూడదు. కిందపడి రాలిపోయిన పూలతో మాత్రమే మహా విష్ణువును పూజించాలి. అలా అని పక్కవారితో కూడా ఈ పారిజాత పువ్వులను తీసుకోకూడదు.
సరస్వతీ దేవి… చదువుల తల్లి సరస్వతీ దేవికి మోదుగు పూలు అంటే చాలా ఇష్టం. ఆ పూలతో పూజించడం వల్ల జ్ఞానాన్ని ప్రసాదించడంతోపాటు సరస్వతి దేవి విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులను ప్రసాదిస్తుంది.
శ్రీకృష్ణ భగవానుడు.. శ్రీకృష్ణుడికి తులసి మొక్కంటే చాలా ఇష్టం. తులసి పూలంటే మరీ ఇష్టం. ప్రసాదాన్ని పెట్టి తులసి పూలతో పూజిస్తే మీ సమస్యలు తీరి, సర్వ సుఖాలు లభిస్తాయి.
Related News
Maha Shivaratri: మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ పనులు అస్సలు చేయకండి?
హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి కూడా ఒకటి. ఈ మహా శివరాత్రి రోజున పరమేశ్వరుని భక్తిశ్రద్ధలతో విశేషంగా పూజిస్తూ ఉంటారు