సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!
- Author : Vamsi Chowdary Korata
Date : 15-01-2026 - 4:30 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి (Sankranti Festival 2026) శోభ మొదలైపోయింది. పట్టణాల నుంచి ఒక్కొక్కరూ సొంతూళ్ల బాట పడుతున్నారు. కొత్త అల్లుళ్ల రాకతో అత్తారింట సందడి మొదలుకాబోతోంది. ఏ ఇల్లు చూసినా సరికొత్తగా కళకళలాడుతూ కనిపిస్తోంది. ఏ వాకిట చూసినా రంగు రంగుల రంగవల్లులు ఆకట్టుకుంటున్నాయి. రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు సింపుల్‌గా, అందంగా సంక్రాంతి 2026 శుభాకాంక్షలు ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం.
తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి మొదలవుతోంది. పల్లెలన్నీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కొత్త శోభను సంతరించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. రంగు రంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, డూడూ బసవన్నలు, హరిదాసుల కీర్తనలు, ఘుమఘుమలాడే పిండి వంటలు, ఢమరుక నాదాలు, జంగమదేవరుల జేగంటలు, పిట్టల దొరల బడాయి మాటలు ముచ్చటైన మూడు రోజుల సంక్రాంతి పండుగను స్వాగతించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి (Sankranti Festival 2026) సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులు.. శ్రేయోభిలాషులు.. బంధుమిత్రులతో పంచుకోవడానికి.. మొబైల్ సందేశాలు (Messages), వాట్సాప్ మెసేజ్‌లు పంపడానికి సరిపడే ఇమేజ్‌లను తెలుగు సమయం (Samayam Telugu) అందిస్తోంది.. వీటితో మీకు బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు 2026 (Sankranti Wishes 2026) సులభంగా చెప్పవచ్చు.
సంక్రాంతి శుభాకాంక్షలు 2026
చెరకులోని తియ్యదనం
పాలలోని తెల్లదనం
గాలిపటంలోని రంగులమయం
మీ జీవితాల్లో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు 2026
మామిడి తోరణాలతో
పసుపు కుంకుమలతో
ముత్యాల ముగ్గులతో
కళ కళలాడే వాకిళ్లతో
మీ ఇల్లు ఆనంద నిలయం కావాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు 2026
భోగభాగ్యాలతో భోగి
సిరిసంపదలతో సంక్రాంతి
కనువిందుగా కనుమ
జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు 2026
తెలుగుదనాన్ని చాటే సంక్రాంతి వేడుక జరుపుకో..
మన తెలుగు వారసత్వాన్ని నిలుపుకో..
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 2026
గుర్తొకొస్తున్నాయా చిన్ననాటి సంగతులు..
వణికించే చలిలో భోగి మంటలు..
కొత్త బట్టల కోసం అలకలు..
మదిలో మెదిలో ఎన్నో మధుర స్మృతులు..
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు 2026
ఇంటి ముంగిట రంగవల్లులు
ఊళ్లో పచ్చని పొలాలు.. స్నేహితులు, బంధువులు
అంబరాన్ని తాకే సంబురాలు.. మన సంక్రాంతి పర్వదినాలు
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 2026
భోగ భాగ్యాలనిచ్చే భోగి
సంబురాల సంక్రాంతి
కమ్మని కనుమ
మీ జీవితంలో కొత్త వెలుగులను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు 2026
మన సంక్రాంతి సంబరాలు..
నింగికెగిరే శాంతి కపోతాలు..
ప్రతి ఇంట్లో ఆనంద కాంతులు..
ప్రతి మనిషిలో అనురాగ మాలికలు..
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 2026
పొగమంచుల్లో ప్రకృతి అందాలు
పచ్చటి పైరుల్లో పుడమి పులకరింతలు
ఇవి మన సంక్రాంతి కాంతులు..
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 2026
భగ భగ భోగిమంటలు
తొలిగిపోయే మలినాలు
మకరజ్యోతి వెలుగులు
జీవన జ్యోతి ఆనందాలు
ఇవే మన సంక్రాంతి సంబురాలు
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 2026