Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Devotional News
  • ⁄Good News To Tirumala Devotees Online Auction To Venkateswara Swamy Gifted Dresses

TTD : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్…వేలానికి స్వామివారి వస్తువులు..వేలంలో ఎలా పాల్గొనాలంటే..?

కలియుగ దైవం...శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. ఎండలను కూడా లెక్కచేయకుండా...భక్తులు గంటలకొద్దీ క్యూలైన్లలో నిల్చుని స్వామివారిని దర్శించుకుంటున్నారు.

  • By Bhoomi Published Date - 09:31 PM, Sun - 12 June 22
TTD : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్…వేలానికి స్వామివారి వస్తువులు..వేలంలో ఎలా పాల్గొనాలంటే..?

కలియుగ దైవం…శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమలకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. ఎండలను కూడా లెక్కచేయకుండా…భక్తులు గంటలకొద్దీ క్యూలైన్లలో నిల్చుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా…రెండేళ్లు శ్రీవారి దర్శనానికి దూరమయ్యారు భక్తులు. అందుకే ఇప్పుడు స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో రికార్డు స్థాయిల భక్తులు పెరుగుతున్నారు. దానికి తగ్గట్లుగానే హుండీ ఆదాయం కూడా గతంలోకంటే భారీగా పెరుగుతూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. గతంలో ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే భక్తులు పోటేత్తావారు. కానీ ఇఫ్పుడు సాధారణ రోజుల్లో కూడా రద్దీ కనిపిస్తోంది. సర్వదర్శనానికి 48గంటలకు పైగా పట్టింది. అంటే దీన్ని బట్టి రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. భక్తుల నుంచి వస్తున్న ఆదరణను బట్టి…టీటీడీ వరుస శుభవార్తలు చెబుతోంది.

శ్రీవారికి సాధారణంగా భారీగానే కానుకలు వస్తుంటాయి. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు తమ శక్తి కొద్దీ కానుకలను నిత్యం సమర్పిస్తుంటారు. ధన, కనుక, వస్తువులను కానులుగా ఇస్తుంటారు. భూరి భూమిని కూడా విరాళంగా ఇస్తారు. లక్షల్లో, కోట్లలో కూడా విరాళాలు ఇస్తుంటారు. సామాన్యులు వారి స్తోమతను బట్టి కానుకలు సమర్పించుకుంటారు. అయితే స్వామివారికి సమర్పించిన వస్త్రాలను శేష వస్త్రాలుగా ప్రసాదంగా భక్తులు భావిస్తుంటారు. వాటిని తీసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని భక్తులు ఆరాపటడుతుంటారు.

ఈ నేపథ్యంలో టీటీడీ స్వామివారి వస్త్రాలను ఈ వేలం వేసేందుకు రెడీ అవుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భారీగానే కానుకలు వచ్చాయి. భక్తులు కానుకగా సమర్పించిన 149 లాట్ల వస్త్రాలను టీటీటీ ఈ వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి 24 వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ వేలం వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వేలంలో పాలిస్టర్ నైలాన్, నైలెక్స్ చీరలు, ఆర్ట్ సిల్క్ చీరలు, బ్లౌజ్ పీస్ లు స్వామివారి సేవకు వినియోగించిన వస్త్రాలు ఉన్నాయి.

ధనవంతుల నుంచి సామాన్యులకు వరకు ఈ వేలంలో పాల్గొనవచ్చు. స్వామివారి వస్త్రాలు కొనుగోలు చేసే ఆసక్తిగల భక్తులు ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ 0877-2264429 సంప్రదించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in/www.tirumala.org ని సంప్రదించి వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Tags  

  • ap
  • tirumala
  • tirupathi
  • ttd

Related News

Missing Fishermen : స‌ముద్రంలో వేట‌కు వెళ్లిన మత్స్యకారుల గ‌ల్లంతు

Missing Fishermen : స‌ముద్రంలో వేట‌కు వెళ్లిన మత్స్యకారుల గ‌ల్లంతు

మచిలీపట్నంలో గల్లంతైన నలుగురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మత్స్యకారుల కోసం పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ, మెరైన్, కోస్ట్ గార్డ్ అధికారులు గాలింపు చ‌ర్య‌ల్లో పాల్గొన్నారు. మచిలీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి మత్స్యకారుల ఫోన్ కాల్ ఆధారంగా వారి ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నేవీకి చెందిన మూడు బోట

  • TTD : రేపు సెప్టెంబ‌ర్ నెల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల‌ చేయ‌నున్న‌ టీటీడీ

    TTD : రేపు సెప్టెంబ‌ర్ నెల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల‌ చేయ‌నున్న‌ టీటీడీ

  • Tirumala : తిరుల‌మ శ్రీవారికి ఒక్క‌రోజు కానుక రూ. 6.18కోట్లు

    Tirumala : తిరుల‌మ శ్రీవారికి ఒక్క‌రోజు కానుక రూ. 6.18కోట్లు

  • TTD Hundi : తిరుమ‌ల శ్రీవారికి ఒక్క రోజులో రూ.6.18 కోట్ల విరాళాలు

    TTD Hundi : తిరుమ‌ల శ్రీవారికి ఒక్క రోజులో రూ.6.18 కోట్ల విరాళాలు

  • TTD Brahmotsavam: ఈ ఏడాది వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

    TTD Brahmotsavam: ఈ ఏడాది వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Latest News

  • Music Maestro Ilayaraja: సంగీత సామ్రాజ్యాధిపతికి వందనం

  • Chandrababu : రాజంపేటపై చంద్ర‌బాబు ఫోక‌స్, ఎంపీ అభ్య‌ర్థి ఆయ‌నే?

  • Vitamin D : విటమిన్ డి సప్లిమెంట్స్ అతిగా తీసుకుంటే ప్రాణానికే ముప్పు…ఈ సమస్యలు తప్పవు..!!

  • Safran : తెలంగాణ‌కు మ‌రో భారీ ప‌రిశ్ర‌మ‌… వెయ్యి కోట్ల పెట్టుబ‌డితో..!

  • Cock Fight : హైదరాబాద్ శివారులో కోడిపందాలు…21మంది అరెస్టు…పరారీలో చింతమనేని..!!

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: