HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Cm Revanth Reddy Will Visit Yadadri District On 8th

CM Revanth Reddy : 8న యాదాద్రి జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy : మిషన్ భగీరథ పథకంలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్‌లైన్ ప్రాజెక్ట్ పైలాన్‌ను సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత పైప్‌లైన్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు.

  • By Latha Suma Published Date - 02:21 PM, Mon - 4 November 24
  • daily-hunt
CM Revanth
CM Revanth

Yadadri Bhuvanagiri District : ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. అయితే అదే రోజున సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు కావడంతో తొలుత యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత అక్కడ వైటీడీఏ (YTDA)పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ఆలయ అభివృద్ధి పనులపై చర్చలు జరుపుతారు. అనంతరం భువనగిరి నియోజకవర్గ పరిధి వలిగొండ మండలంలో గల బొల్లేపల్లి, సంగెం, భీమలింగం వంతెన వరకు ఎమ్మెల్యే కుంభం అనిల్ ఆధ్వర్యంలో చేపట్టబోయే మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్రలో సీఎం పాల్గొననున్నారు.

ఇక, మిషన్ భగీరథ పథకంలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్‌లైన్ ప్రాజెక్ట్ పైలాన్‌ను సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత పైప్‌లైన్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. కాగా, సీఎం యాదాద్రి టూర్ షెడ్యూల్‌ను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పర్యవేక్షిస్తున్నారు. సీఎం వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

అదేవిధంగా ప్రధాన ఆల‌య విమాన గోపురం స్వ‌ర్ణ‌తాప‌డం ప‌నుల‌పై ఆయ‌న స‌మీక్ష చేయ‌బోతున్నార‌ట‌. దీంతో ఆల‌య అభివృద్ధిపైనా కీలక నిర్ణ‌యాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి యాదాద్రికి వ‌స్తుండ‌టంతో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. కార్తీక‌మాసం కావ‌డంతో భ‌క్తుల ర‌ద్దీ కూడా ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి సీఎం ప‌ర్య‌ట‌న‌కు ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌కుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మొద‌టిసారి సీఎం కుటుంబ స‌మేతంగా స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను ప్రారంభించారు.

Read Also: Beauty Tips: పచ్చి పాలతో మెరిసిపోయే చర్మాన్ని సొంతం చేసుకోండిలా!

 

 

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • Mission Bhagiratha Scheme
  • MLA Kumbam Anil
  • Musi Renaissance Public Awareness Campaign
  • Yadadri Sri Lakshmi Narasimha Swamy
  • Yadadri-Bhuvanagiri district
  • ytda

Related News

Congress

Congress: కాంగ్రెస్‌తోనే తెలుగు సినీ పరిశ్రమకు స్వర్ణయుగం!

ఆ దుష్చక్రాన్ని అంతం చేసి, సినీ పరిశ్రమకు స్వేచ్ఛను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ ప్రకటన స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత పరిశ్రమలోని నటులు, నిర్మాతలు అందరికీ నమ్మకం తిరిగి వచ్చిందని పేర్కొంది.

  • Sadar Sammelan

    Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

Latest News

  • SSMB 29 Update: మ‌హేష్‌- రాజ‌మౌళి మూవీ.. లీక్ వ‌దిలిన త‌న‌యుడు!

  • Credit Card: క్రెడిట్ కార్డు భద్రత: 6 ముఖ్యమైన రహస్యాలు మీ కార్డును రక్షించుకోండి

  • Blood Sugar: మ‌ధుమేహం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆకు జ్యూస్ తాగండి!

  • New Hyundai Venue: హ్యుందాయ్ వెన్యూ బుకింగ్‌లు ప్రారంభం!

  • Nandamuri Kalyan Ram : కొత్త డైరెక్టర్‌కి ఛాన్స్ ఇస్తోన్న నందమూరి హీరో..!

Trending News

    • CM Chandrababu Naidu : కర్నూల్ బస్ ప్రమాదం చంద్రబాబు సీరియస్ ..వారిపై కఠిన చర్యలు.!

    • Akhanda 2: ‘అఖండ 2’లో బాలకృష్ణ డ్యూయల్ రోల్.. ఎమ్మెల్యేగా కూడా కనిపించనున్నారా?

    • Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!

    • Justice Surya Kant: సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాని న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. ఎవ‌రీయ‌న‌?

    • Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd