Beauty Tips: పచ్చి పాలతో మెరిసిపోయే చర్మాన్ని సొంతం చేసుకోండిలా!
పచ్చిపాలతో కూడి రెమిడిలను ఫాలో అయితే మెరిసిపోయే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:13 PM, Mon - 4 November 24

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పాలలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందడంతో పాటు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అయితే పాల వల్ల కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. పచ్చి పాలను ఉపయోగించి మెరిసిపోయే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చట. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పచ్చి పాలు చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడే మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి.
ఇది సహజ కొవ్వులు, ప్రోటీన్లు, నీటిని కలిగి ఉంటుంది. ఇవి చర్మం తేమ సమతుల్యతను పునరుద్ధరించడానికి , నిర్వహించడానికి సహాయపడతాయి. పచ్చి పాలు చర్మంపై రక్షిత పొరను ఏర్పరుస్తుంది. అలాగే తేమ నష్టాన్ని కూడా నివారిస్తుందట. చర్మాన్ని కూడా మృదువుగా మారుస్తుందని చెబుతున్నారు. కాగా పచ్చి పాలలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలు, వడదెబ్బ, చర్మానికి చికాకు వంటి వివిధ చర్మ సమస్యలకు ఉపశమనాన్ని అందిస్తాయట. ఇది చికాకు కలిగించే చర్మాన్ని శాంత పరచడానికి, ఎరుపును తగ్గిస్తుందట. అసౌకర్యాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. పసుపు, పచ్చి పాలను ఉపయోగించి పేస్ట్ తయారు చేయవచ్చు.
అవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, చర్మాన్ని ప్రకాశవంతం చేసే లక్షణాలను కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే పాలు తేనె ఈ రెండింటిని కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల ఆరోగ్యమైన చర్మం మీ సొంతం అవుతుందని చెబుతున్నారు. పాలు, ఫుల్లర్.. ఈ రెండు మిశ్రమాలను కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల.. స్మూత్ స్కిన్ టెక్స్చర్, హైడ్రేషన్ , గ్లోయింగ్ స్కిన్ కావాలనుకునే వారి కోసం ఈ కాంబినేషన్ బాగా సెట్ అవుతుందని చెబుతున్నారు. పాలు, రోజ్ వాటర్ , చియా విత్తనాలు.. ఈ మూడింటినీ కలిపి ప్యాక్ లాగా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ మీ ముఖం నుండి ధూళిని తొలగించడానికి సహాయపడుతుంది. పచ్చి పాలను పంచదార, శెనగపిండితో కలిపి స్క్రబ్ ను తయారు చేసుకోవచ్చు. ఇది మృత కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.