Chardham Yatra : నేటి నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభం
ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ నుంచి అంటే నేటీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర యమునోత్రి నుంచి ప్రారంభం అవుతుంది. బద్రీనాథ్ సందర్శించిన తర్వాత యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రకు కోట్లల్లో జనాలు వస్తారు.
- By Latha Suma Published Date - 12:29 PM, Wed - 30 April 25

Chardham Yatra : ఈరోజు నుంచి చార్ దమ్ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో గంగోత్రి అలాగే యమునోత్రి అనే రెండు ఆలయ ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి. నాలుగు ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాలు గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ చేసే ప్రయాణాన్ని చార్ ధమ్ యాత్ర అని పిలుస్తారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ నుంచి అంటే నేటీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర యమునోత్రి నుంచి ప్రారంభం అవుతుంది. బద్రీనాథ్ సందర్శించిన తర్వాత యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రకు కోట్లల్లో జనాలు వస్తారు.
Read Also: PM Modi AP Tour : వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ .. ఏపీ రాజకీయాల్లో ఉద్రిక్తత
మే రెండవ తేదీన కేదార్నాథ్ అలాగే మే 4వ తేదీన బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్ అవుతాయి. అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు చార్ ధామ్ యాత్రకు 20 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
కాగా, ఈరోజు ఉదయం గంగోత్రి , యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి గంగోత్రి వద్ద పూజలు నిర్వహించారు. అక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేద మంత్రోచ్చరణ మధ్య ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు గంగోత్రి ఆలయాన్ని తెరిచారు. ఆ తర్వాత 11.30 నిమిషాలకు యమునోత్రి ఆలయాన్ని ఓపెన్ చేశారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజునే ఛార్‌దామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ఇక, హిందూ మతం యొక్క విశ్వాసాల ప్రకారం, ఒక వ్యక్తి చార్ ధామ్ సందర్శించడం ద్వారా మోక్షాన్ని పొందుతాడు. పాపాలు నశిస్తాయి. ఆ వ్యక్తి జీవితంలో ఆనందం, శాంతి ఉంటాయని నమ్ముతారు.