Covid Cases: ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు
- By Latha Suma Published Date - 12:43 PM, Thu - 7 March 24

Covid Cases: ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు(Covid Cases) పెరుగుతున్నాయి. ఢిల్లీ(Delhi)లో గత 24 గంటల్లో 63 కొత్త కోవిడ్19 కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది మే నెల తర్వాత అక్కడ అత్యధిక సంఖ్యలో ఆ కేసులు నమోదు అయినట్లు రికార్డుల చెబుతున్నాయి. ఢిల్లీతో పాటు రాజస్థాన్(Rajasthan),ఉత్తరప్రదేశ్(Uttar Pradesh),బీహార్ (Bihar)రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరిగాయి. గడిచిన 15 రోజుల నుంచి ఢిల్లీలో కొత్తగా 459 వైరస్ కేసులు నమోదు అయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join.
రాజస్తాన్‌లో గడిచిన 15 రోజుల్లో కొత్తగా 226 కేసులు నమోదు అయ్యాయి. ఆ రాష్ట్ర సీఎం భజన్ లాల్ శర్మ(CM Bhajan Lal Sharma) కూడా పాజిటివ్‌గా తేలారు. అయితే ప్రస్తుతం టెస్టింగ్ తక్కువగా ఉన్న కారణంగా.. నిజానికి పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
read also : Janasena : జనసేన పోటీ చేసే సీట్ల జాబితా..?
ఢిల్లీలో ఒకే రోజు 50 కన్నా ఎక్కువ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు కావడం గత ఏడాది మే తర్వాత ఇదే తొలిసారి. ఈ ఏడాది శీతాకాలంలో కేసులు పెరిగినా అవి స్వల్పంగానే ఉంది. యూపీ, బీహార్‌లో కూడా కేసులు పెరుగుతున్నాయి. గత 15 రోజుల్లో యూపీలో 164 కేసులు నమోదు అయ్యాయి. బీహార్‌లో 14 నుంచి కేసుల సంఖ్య 103కు చేరుకున్నది.