Poonam Kaur : పూనమ్ కౌర్ ట్వీట్‌పై బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. !
- Author : Vamsi Chowdary Korata
Date : 30-09-2025 - 2:44 IST
Published By : Hashtagu Telugu Desk
నటి పూనమ్ కౌర్ చేసిన బాలయ్యపై కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ బాలకృష్ణని పొగిడిందని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బాలయ్య గత వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పూనమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెగా, నందమూరి అభిమానుల మధ్య వార్ మొదలైంది. పూనమ్ కౌర్ ట్వీట్‌పై నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుండగా.. బాలయ్య గతంలో చేసిన కామెంట్లని గుర్తుచేస్తూ మెగా ఫ్యాన్స్ పూనమ్‌పై మండిపడుతున్నారు.
🫶 ballaya – as I always said child like energy – god makes people instrument for a purpose which is revealed with time 😇. https://t.co/b0VufEUBw8
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 30, 2025
తాజాగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ మరోసారి చర్చకు దారితీసింది. ‘బాలయ్య ఎప్పుడూ చిన్నపిల్లాడిలా ఉత్సాహంగా ఉంటారని నేను ఎప్పుడు చెబుతుంటాను. దేవుడు కొందరు వ్యక్తుల్ని ఓ లక్ష్యం కోసం సాధనంలా సృష్టిస్తాడు. అది సమయానుసారం బయటపడుతుంది’ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. సినీ వజ్రోత్సవాల్లో ‘సమర సింహారెడ్డి’ చిత్రంలోని నందమూరి నాయకా అందమైన కానుకా ముందరుంది చూసుకోరా అనే సాంగ్‌కి తాను డ్యాన్స్ వేస్తుంటే బాలకృష్ణ ఉత్సాహంగా ఊగిపోతూ చూసే వీడియోను 2024, సెప్టెంబర్ 1న పూనమ్ ట్వీట్ చేసింది. అందులో ‘బాలయ్య పెద్ద వృక్షం లాంటి వారు. అది అన్ని సీజన్లలోనూ అది మనుషులు, జంతువులకు నీడనిస్తుంటుంది. ఆదిత్య 369 నుంచి భగవంత్ కేసరి వరకు ఆయన చిన్న పిల్లాడిలా ఉత్సాహంగానే కనిపిస్తున్నారు. అది ఆయనకు దేవుడు, తండ్రి ఎన్టీఆర్ ఇచ్చిన ఆశీర్వాదం’అని ట్వీట్ చేసింది. అప్పటి ట్వీట్‌ని ట్యాగ్ చేస్తూ పూనమ్ తాజా ట్వీట్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది.
పూనమ్ కౌర్ ట్వీట్‌పై బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మెగా ఫ్యామిలీపై కోపంతో బాలయ్యని పొగుడుతున్నావా.. ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలంటూ ఆయన అన్న మాటలు మరిచిపోయావా? అని పూనమ్‌కి గుర్తుచేస్తున్నారు. మహిళలపై గౌరవం లేని వ్యక్తిని నువ్వు పొగడటం అస్సలు బాగోలేదు అని కామెంట్లు చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎదగలేకపోయావు కాబట్టే ఇలా వివాదస్పద ట్వీట్లతో ఫేమస్ కావాలని అనుకుంటున్నావా? అని నిలదీస్తున్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే హోదాలో బాలకృష్ణ మాట్లాడుతూ చిరంజీవిపై కొన్ని కామెంట్స్ చేశారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యల్ని ఖండిస్తూ చిరంజీవి ఘాటుగా ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సోషల్‌మీడియాలో నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది. ఈ టైమ్‌లో పూనమ్ చేసిన ట్వీట్ మరింత అగ్గి రాజేసిందనే చెప్పాలి.