HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >We Scored A Hit With Mass Jatara

Ravi Teja : మాస్ జాతర’తో హిట్ కొట్టాం.!

  • By Vamsi Chowdary Korata Published Date - 10:59 AM, Sat - 1 November 25
  • daily-hunt
Mass Jathara Review
Mass Jathara Review

సూడండ్రా అబ్బాయిలు.. గత కొన్నేళ్లుగా ఫ్లాప్ సినిమాలు తీసి మీకు చిరాకు దొబ్బించాను. ‘మాస్ జాతర’తో హిట్టు కొడుతున్నాం.. ఫిక్స్ అయిపోండి అని చాలా కాన్ఫిడెన్స్‌గా ఫ్యాన్స్‌కి మాట ఇచ్చారు మాస్ రాజా రవితేజ. ఆయనకి పెద్దగా యాంటీ ఫ్యాన్స్ వార్ ఉండదు కాబట్టి.. సినిమా ఓ మోస్తరుగా ఉన్నా కూడా లాక్కొచ్చేస్తుంటుంది. చాలామందిలో రవితేజ అంటే మనోడే అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి.. ఆయన ధీమాగా చెప్పడంతో ‘మాస్ జాతర’పై కాస్తో కూస్తో నమ్మకం అయితే కలిగింది. మరి ఇచ్చిన మాటని రవితేజ నిలబెట్టుకున్నాడా? గత కొన్నాళ్లుగా చిరాకు పెట్టించిన రవితేజ ఈ సినిమాతో మాస్ ఆడియన్స్‌కి జాతర చూపించాడో లేదో రివ్యూలో చూద్దాం.

కొన్ని కొన్ని ట్యాగ్స్ హీరోలకు బలవంతంగా అతికించినట్టుగా ఉంటాయి కానీ.. ‘మాస్’అనే మాట రవితేజ ఇంటి అడ్రస్ లెక్క. మాస్‌రాజా రవితేజా సినిమా ఏదైనే సరే.. అతని ఫ్యాన్స్‌కి ‘మాస్ జాతరే’. అలాంటి మాస్ జాతరనే సినిమా పేరుగా పెట్టుకుని ఈసారి ఏ మాత్రం నిరుత్సాహ పరచను.. పక్కాగా హిట్ కొడుతున్నాం అని ధీమాగా చెప్పిన రవితేజ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయారు దర్శకుడు భాను భోగవరపు.

మాస్ జాతర ట్రైలర్ చూసినప్పుడు ఎలా ఉందని అడిగితే యాజిటీజ్ అలాగే ఉందనే కామెంట్లు వినిపించాయి. కొత్తగా ఏం అనిపించలేదు. పైగా రవితేజ పోలీస్ డ్రెస్ వేస్తే.. చాలా సినిమాల్లో చూసినగెటప్పే కదా.. ఈ మీసం తిప్పుడూ మాస్ ఎలివేషన్స్‌ రవితేజకి అలవాటైన గెటప్పూ.. సెటప్పూ అనేట్టుగానే అనిపించాయి. కానీ.. ట్రైలర్ చూసి సినిమాని అంచనా వేయలేం కదా.. కథలో ఏదైనా కొత్త విషయం ఉండొచ్చు అని ఆశపడ్డవాళ్లకి ఎదురుచూపులే మిగిలేట్టుగా ‘మాస్ జాతర’ని రొటీన్ జాతరగా మార్చేశారు.

సాధారణం పోలీస్ నేపథ్యంలోని కథలన్నీ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. హీరో డ్యూటీ మీద ఓ ఏరియాకి వెళ్తాడు. అక్కడో పరమ దుర్మార్గమైన విలన్ ఉంటాడు. చివరికి ఆ విలన్‌ని హీరో మట్టుపెడతాడు. ఎటు నుంచి ఎటు తిప్పినా.. ముగింపు అయితే ఇదే. కాబట్టి తెలియని కథ కంటే.. తెలిసిన కథని ప్రేక్షకుడికి ఆసక్తిగా చెప్పడం అనేది ఇంకా కష్టం. ఏ మాత్రం తేడా కొట్టినా కూడా రొటీన్ అనే పెదవివిరుపులు వచ్చేస్తుంటాయి. అందులోనూ మాస్ రాజ రవితేజ సినిమాలన్నా.. పోలీస్ పాత్రలన్నా.. ఎక్కడో చూసినట్టు ఉందే అని ఫీలింగ్‌ వెంటాడేస్తాయి. అలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా కథని డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ.. కొత్త దర్శకుడు భాను భోగవరపు ఈ సినిమా పాటలో చెప్పినట్టుగా.. ‘రిథమ్ లేదు.. కథం లేదు.. పదం లేదు.. అర్ధం లేదు.. పర్ధం లేదు’ అంటూ చివరికి పాత కథతోనే ఫ్రెష్‌గా పాత్రలు మార్చి మళ్లీ చూపించారు.

లక్షణ్ భేరి (రవితేజ) ఓ రైల్వే పోలీస్. వరంగల్‌లో ఓ పొలిటీషియన్ కొడుకుని కొట్టి అడవివరం అనే ఏజెన్సీ ఏరియాకి ట్రాన్స్ ఫర్ అవుతాడు. అక్కడ శివుడు (నవీన్ చంద్ర) గంజాయి పంట పండిస్తూ.. కలకత్తాకి స్మగ్లింగ్ చేస్తుంటాడు. ప్రభుత్వ పెద్దల అండదండలూ.. పోలీస్ వ్యవస్థ అతని కనుసన్నల్లో ఉండటంతో ఆ ప్రాంతం అంతా శివుడు కంట్రోల్‌లోనే ఉంటుంది. అలాంటి ప్రాంతానికి వెళ్లి.. శివుడ్ని మట్టుపెట్టడానికి లక్ష్మణ్ భేరి ఎలాంటి రిస్క్ చేశాడన్నదే ‘మాస్ జాతర’ కథా.. కథనం.

మాస్ రాజా రవితేజ ఐకానిక్ మూమెంట్స్‌ని సెలబ్రేట్ చేసుకునేలా ఆయన పాత సినిమాల రిఫరెన్స్‌లను బాగా వాడుకున్నారు దర్శకుడు. మాస్ రాజాకి పూనకం వచ్చినట్టే చేశారు యాక్షన్ ఎపిసోడ్‌లలో. సాధారణంగా శ్రీలీల ఉందంటే.. డాన్స్ అద్దరేస్తుందని అనుకుంటాం. కానీ.. ‘మాస్ జాతర’ రవితేజ ఎనర్జీతో ఆమెను డ్యామినేట్ చేశారు. ఈ వయసులో కూడా ఎంత ఎనర్జీ ఏంట్రా సామీ అనేట్టుగా.. పాటల్లో చెలరేగిపోయారు రవితేజ. ఇడియట్ లోని రవితేజని గుర్తు చేస్తూ.. నాటి సిగ్నేచర్ మూమెంట్స్‌తో మాస్ ఆడియన్స్‌‌తో విజిల్స్ వేయించారు. డాన్స్ కుమ్మేయడంతో పాటు.. యాక్షన్ ఎపిసోడ్స్‌ చాలా మాసీగా అనిపిస్తాయి. రవితేజకి యాక్షన్‌తో పాటు.. కామెడీ టైమింగ్ కూడా కుమ్మేస్తారు. ఇందులో ఆయన శక్తికి మించి కామెడీ చేసే ప్రయత్నం చేసినా.. వర్కౌట్ అయ్యే స్టఫ్ కంటెంట్‌లో కనిపించలేదు.

సామజవరగమన లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాతో రైటర్‌గా మంచి మార్కులు వేయించుకున్న భాను భోగవరపు.. దర్శకుడిగా పరిచయం కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు.. చాలామంది ఆయన్ని అడిగిన మాట.. మంచి మాస్ కథ ఉంటే చెప్పవయ్యా అని. మాస్ కథ అంటే మాస్ రాజా రవితేజ గుర్తొస్తారు కాబట్టి.. అలాంటి కథ రాసి చివరికి ఆయనకే చెప్పారు భాను భోగవరపు.

సాధారణంగా కథ రాసే విధానంలో చాలా లెక్కలు ఉంటాయి. కథ రాసి.. దానికి సెట్ అయ్యే హీరోని వెతకడం.. లేదా పలానా హీరోని అనుకుని అతనికి సెట్ అయ్యేలా కథ రాయడం. రవితేజ విషయంలో రెండు ఫార్ములానే ఫాలో అయ్యారు దర్శకుడు. రవితేజని దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాశారు. కథ ఎలా రాసినా కూడా.. ఆ కథని ఎంత ఎంగేజింగ్‌గా చెప్పాం అన్నదే ముఖ్యం. రవితేజకి కథ చెప్పి ఒప్పించడంలో సక్సెస్ అయిన దర్శకుడు.. ఆ కథని తెరపై ఆవిష్కరించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారు. రవితేజ ఆల్రెడీ పోలీస్ సినిమాలు కొన్ని చేశారు కాబట్టి… అందుకే కొత్తగా ఉండేలా ఈ రైల్వే పోలీస్ కథని రాసుకున్నారు. ఇప్పటివరకూ పోలీస్ అంటే ఎస్ఐ, సీఐ, ఏసీపీ, ఎస్పీ లాంటి కథలే చూశాం.. రైల్వే పోలీస్‌ నేపథ్యంలో కథ రాలేదు కాబట్టి రైల్వే పోలీస్ పవర్స్‌ని రవితేజతో చూపిస్తే కొత్తగా ఉంటుందనే దర్శకుడి ఆలోచన బాగానే ఉన్నా? మిగిలిన సెటప్ మొత్తం రొటీన్‌గా మారింది. రవితేజ ఫ్యాన్స్ ఎలాంటి యాక్షన్ ఎపిసోడ్‌లను కోరుకుంటారో.. వాటిపై మాత్రమే దృష్టిపెట్టిన దర్శకుడు కథలోని కోర్ ఎమోషన్‌ని పండించలేకపోయారు.

పేక ముక్కలు పేర్చినట్టుగా.. హీరో ఎంట్రీ, యాక్షన్ ఎలిమెంట్స్, ఓ పాటా.. మరో ఫైటూ.. ఇలా పేర్చుకుంటూ కమర్షియల్ మీటర్ ఫార్ములా ఫాలో అయిపోయారు. ఎంత కమర్షియల్ సినిమా అయినా ఎమోషనల్ టచ్ ఉంటేనే.. తెరపై కనిపించే భావోద్వేగాలను చూసే ప్రేక్షకుడు ఫీల్ అవ్వాలి. అప్పుడే ఆ కథతో జర్నీ చేస్తాడు. ‘మాస్ జాతర’లో కనిపించే పాత్రకీ పాత్రకీ కనెక్టివిటీ కుదరకపోవడంతో.. అది ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేకపోయింది.

హీరో రైల్వే పోలీస్ కావడానికి చెప్పిన చూపించిన నేపథ్యం సీరియస్‌గా అనిపించదు. అనుష్క ఘాటి సినిమా రిజల్ట్ చూసిన తరువాత కూడా.. ఆ సినిమాలోని శీలవతి అనే గంజాయి సాగు కథాంశాన్నే.. తిరిగి ‘మాస్ జాతర’లో పెట్టడం కొత్తగా అనిపించదు. ఇదంతా ఘాటీలో చూశాం కదా? అనే ఫీలింగ్ కలుగుతుంది. మరి దర్శకుడు కథ రాసుకున్న తరువాత ఘాటీ వచ్చిందా? లేదంటే.. ఆల్రెడీ రాసేశాం కాబట్టి ఇంకేం మార్చుతాంలే అనుకున్నారో ఏమో కానీ ‘శీలవతి గంజాయి’ నేపథ్యం సేమ్ అదే ఇదీ.

అలాగే ఈ సినిమాలో కోర్ ఎమోషన్ అంటే.. తాత, మనవడి పాత్రలతోనే. ఆ పాత్రల్లో రాజేంద్రప్రసాద్, రవితేజలు సూట్ కాలేదు. రాజేంద్రప్రసాద్‌.. ఈ సినిమా హిట్ కాకపోతే ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతాను అంటూ స్టేట్‌మెంట్‌లు ఇచ్చేశారు కానీ.. ఆ పాత్ర ఎబ్బొట్టుగా అనిపిస్తుంది. కామెడీ కోసం ఏదో ట్రై చేసినా.. ఎమోషన్స్ పండించాల్సిన చోట సరిగా పండలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ప్రేక్షకుడికి ముందే తెలిసిపోవడం.. ఎలాంటి ట్విస్ట్‌లు, టర్న్‌లు లేకుండా ఎలివేషన్లు, పాటలు, ఫైట్లతోనే సరిపెట్టేయడం ఈ సినిమా పెద్ద మైనస్.

పోనీ హీరోయిన్ శ్రీలీలతో హీరో ఎఫెక్షన్ అయినా కుదిరిందా అంటే.. అంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఆమెను చూడగానే చొంగ కార్చుకుంటూ వెనకపడటం కథలో సీరియస్ నెస్‌ని తగ్గించినట్టుగా అనిపిస్తుంది. పోనీ ఆమె అసలు రంగు బయటపడిన తరువాత.. ఆమెను మార్చుకునే ప్రయత్నం హీరో చేశాడా అంటే అది లేదు. ఓ సెంటిమెంట్ సీన్ పెట్టేసి ఇద్దర్నీ కలిపేసినట్టుగానే అనిపిస్తుంది. ఆ సెంటిమెంట్ సీన్ కూడా.. కావాలని ఇరికించినట్టుగా అనిపిస్తుంది.
తులసి పాత్రలో గతంలో కంటే కాస్త మెరుగైన పాత్ర చేసిందంతే శ్రీలీల. డాన్స్‌లు బాగా చేస్తుందనే ఒకే ఒక్క కారణంతోనే ఆమెకి అవకాశాలు క్యూ కడుతున్నాయో ఏమో కానీ.. అబ్బా అనిపించేంత గొప్పగా అయితే లేదు.

ఆమె లిస్ట్‌లో జూనియర్, రాబిన్ హుడ్, గుంటూరు కారం, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్, ఆది కేశవ, భగవంత్ కేసరి, స్కంధ.. ఇప్పుడు ‘మాస్ జాతర’ చేరింది. గ్యాంగ్ లీడర్‌‌లో చిరంజీవి-విజయశాంతి మధ్య సీన్లు ఎలాగైతే కామెడీ టచ్‌తోతో మాసీగా ఉంటాయో.. ఇందులో రవితేజ-శ్రీలీల మధ్య సన్నివేశాలు అలాగే ఉంటాయని చెప్పి దర్శకుడు.. ఆలోచనకే పరిమితం అయ్యారు. రవితేజలో మాసీ కామెడీ టైమింగ్‌ని సరిగా ఎగ్జిక్యూట్ చేయలేదు.

ప్రతినాయకుడు శివుడుగా నవీన్ చంద్ర విలనిజం పండించడం కోసం గట్టిగానే కష్టపడ్డారు. డిఫరెంట్ మేనరిజం ట్రై చేశారు. బట్ రొటీన్ విలన్ ఫార్మెట్ కావడంతో.. ఎంత కష్టపడ్డా ఆ పాత్ర అక్కడక్కడే తిరుగుతన్నట్టుగానే అనిపిస్తుంది. హీరో వెళ్లి విలన్‌కి వార్నింగ్ ఇవ్వడం.. విలన్ వచ్చి హీరోకి వార్నింగ్ ఇవ్వడం. ఓసారి అతను కొట్టడం. ఇంకోసారి ఇతను కొట్టడం. చివరికి హీరో చేతిలో చావడంతో శివుడు పాత్రని రొటీన్‌గానే ముగించారు. హైపర్ ఆది, మురళీశర్మ, నవ్యస్వామి, సముద్రఖని ఆయా పాత్రలకు న్యాయం చేశారు. నవ్వస్వామికి సింగిల్ డైలాగ్ లేకపోయినా.. హీరో పాత్రకి మంచి ఎలివేషన్స్ వచ్చే సీన్‌లో భాగం అయ్యింది.

టెక్నికల్‌‌గా సినిమా చాలా గ్రాండ్‌గా అనిపిస్తుంది. నాగవంశీ ఖర్చుకి వెనకాడకుండా క్వాలిటీ సినిమా అందించే ప్రయత్నం చేశారు. ఆరున్నర కోట్లతో వేసిన స్టేషన్ సెట్.. అలాగే ‘మాస్ జాతర’లో జాతర ఎపిసోడ్ కోసం మరో భారీ సెటప్ హైలైట్‌గా నిలిచింది. ఓ కొత్త దర్శకుడికి ఎక్కడా రాజీపడకుండా గట్టిగానే ఖర్చు చేశారు. ఇందులో దేవి ప్రియ అనే పేరుతో ఓ జోకర్ పాత్ర ఉంటుంది. ఈ మధ్య కాలంలో అదే పేరుతో ట్విట్టర్‌లో హల్ చేసే ఓ సినిమా రిపోర్టర్‌పై గట్టిగానే సెటైర్లు పడ్డాయి. ఇది ప్రొడ్యుసర్ ఛాయిస్‌నో ఏమో కానీ.. ఆ ఊరూ పేరు లేని దేవి ప్రియకి గట్టిగానే దింపారు. ‘‘దేవి ప్రియ మంచి ఊపు మీద ఉన్నాడు.. ఊపే వరకూ ఆపేలా లేరు.. లేపలేరూ’’, ‘సొంతపేరు పెట్టుకునే ధైర్యం లేదు కానీ.. ఫ్యాన్స్ వార్ చేస్తావ్ రా’, ‘చేతిలో ఉంటుంది లాటీ.. చేయడానికి ఉండదు డ్యూటీ’ ఇలాంటి డైలాగ్‌లు చూస్తే పాపం ఆ ముసలి ప్రాణం ఏమైపోయందో ఏమో అనేట్టుగానే ఉన్నాయి ‘దేవి ప్రియ’పై పెట్టిన డైలాగ్‌లు. ఇవన్నీ కూడా ప్రొడ్యుసర్ నాగవంశీ స్పెషల్ ఇంట్రస్ట్‌తో పెట్టించారో.. లేదంటే దర్శకుడు క్రియేటివిటీనో తెలియదు కానీ… ఆ సినిమా రిపోర్టర్‌పై సెటైర్లు గట్టిగానే పడ్డాయి.

యాక్షన్ ఎపిసోడ్‌లో విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయ్యింది. ఈ సినిమాలో మరో మేజర్ హైలైట్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్. పాటలైతే దంచిపారేశారు. ఆ పాటల ప్లేస్ మెంట్ సరిగా కుదర్లేదు కానీ.. పిక్చరైజేషన్ చాలా బావుంది. సాంగ్స్ కొరియోగ్రఫీ కూడా బావుంది. రవితేజను దేవుడిలా భావించే భీమ్స్ తన ప్రేమను పాటల రూపంలోనే కాకుండా.. నేపథ్య సంగీతంతోనూ చూపించారు. అయితే కొన్ని యాక్షన్ ఎపిసోడ్‌లు మాత్రం పూనకం వచ్చేట్టుగా అనిపిస్తాయి కానీ.. మరికొన్ని చోట్ల మోతాదుకి మించినట్టుగా అనిపిస్తాయి. మన బాలయ్య బాబు సినిమాల్లో తమన్ బాబు వాయించినట్టుగా అవసరం లేని చోట కూడా వాయించిపారేసినట్టుగా అనిపిస్తాయి కొన్ని సీన్లు.

ఓవరాల్‌గా.. ‘సూపర్ డూపర్.. సూపర్ డూపర్’ పాటలో ఉన్న లిరిక్స్ మాదిరే.. ‘‘అర్ధం లేదు పర్థం లేదు.. తలా తోక లేదు.. రాగం, తాళం లేదు.. రిథమ్ లేదు.. కథం లేదు, పల్లవి లేదు.. చరణం లేదు, సెన్స్ లేదు.. కామన్ సెన్స్ లేనే లేదు. ఇన్ని లేకపోయినా మాస్ రాజా ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే ఎలివేషన్స్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Mass Jathara
  • mass jathara movie
  • Ravi teja
  • tollywood

Related News

Bhagyashree Borse

Bhagyashree Borse : ‘అరుంధతి’గా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ హీరోయిన్..!

రామ్ పోతినేని హీరోగా నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా నవంబర్ 27న విడుదల కానుంది. ఇందులో మహాలక్ష్మి గా నటించిన భాగ్యశ్రీ బోర్సే, తన పాత్రకు వస్తున్న రెస్పాన్స్‌పై సంతోషం వ్యక్తం చేసింది. పల్లెటూరి అమ్మాయి పాత్ర కథలో కీలకమని, ప్రేక్షకులు ఈ పాత్రను తప్పకుండా గుర్తుంచుకుంటారన్నారు. రెండు సినిమాలతోనే వచ్చిన అభిమానాన్ని అదృష్టంగా భావిస్తున్నానని, భవిష్యత్తులో అరుంధతి తరహా పాత

  • Naga Chaitanya

    Naga Chaitanya: NC24 నుంచి బిగ్ అప్డేట్‌.. మేకింగ్ వీడియో విడుద‌ల‌!

  • Suriya

    Suriya: సూర్య 47వ సినిమా కూడా తెలుగు డైరెక్టర్‌తోనేనా? వారితో చర్చలు!

  • iBomma

    Ibomma One : ఐ బొమ్మ ప్లేస్ లో ‘ఐబొమ్మ వన్’..ఇండస్ట్రీ కి తప్పని తలనొప్పి

  • Rajamouli

    Rajamouli: వార‌ణాసి వివాదాలపై ఎస్ఎస్‌ రాజమౌళి స్పందిస్తారా?

Latest News

  • India A Lost: భారత్‌ ఏ అవమాన పరాజయం

  • Ind vs SA: గువాహటి టెస్ట్‌కు రబడా ఔట్

  • Bihar Minister: బిహార్‌లో సర్ప్రైజ్ మంత్రి దీపక్ ప్రకాశ్

  • KTR vs Congress: కేటీఆర్ పై కిరణ్ కుమార్ రెడ్డి సంచలన విమర్శలు

  • Akhanda 2: ఫ్యాన్స్‌కు పూనకాలే..! బాలయ్య మజాకా – దుమ్మురేపిన Akhanda 2 ట్రైలర్ విడుదల

Trending News

    • Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!

    • Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

    • Earthquake : బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రత భూకంపం… కోల్కతా, దక్షిణ బెంగాల్‌లో స్పష్టంగా అనుభవించిన ప్రకంపన!

    • New Smart Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలా.. కొత్తగా పెళ్లైన వారికి కూడా శుభవార్త.. చాలా సింపుల్!

    • IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆట‌గాళ్ల‌పై రూ. 20 కోట్ల వర్షం కురవనుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd