Viswak Sen : ఆ ఇష్యూ వల్ల నేనే ఎక్కువ నష్టపోయా.. బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో అయితే అలా ప్రెస్ మీట్ పెట్టేవారా..?
Viswak Sen యువ హీరోల్లో అనతికాలంలోనే మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న విశ్వక్ సేన్ మాస్ కా దాస్ అంటూ తన స్క్రీన్ నేం కి తగినట్టుగానే అదరగొట్టేస్తున్నాడు. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ
- By Ramesh Published Date - 08:18 AM, Tue - 20 February 24

Viswak Sen యువ హీరోల్లో అనతికాలంలోనే మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న విశ్వక్ సేన్ మాస్ కా దాస్ అంటూ తన స్క్రీన్ నేం కి తగినట్టుగానే అదరగొట్టేస్తున్నాడు. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న ఈ యువ హీరో లేటెస్ట్ గా తను నటించిన గామి సినిమా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ ప్రమోషన్స్ లో తనపై సీనియర్ హీరో అర్జున్ సర్జా చేసిన కామెంట్స్ పై స్పందించాడు విశ్వక్ సేన్.
అర్జున్ సర్జా డైరెక్షన్ లో విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమా అనుకున్నారు. ఆ సినిమా షూటింగ్ టైం లో విశ్వక్ సేన్ కుదరదని చెప్పేసరికి అతని మీద ఫైర్ అవుతూ అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ సేన్ పై విమర్శలు చేశారు. అయితే ఆ ఇష్యూ వల్ల తానే ఎక్కువ నష్టపోయానని చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్. బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో అయితే అలా ప్రెస్ మీట్ పెట్టే వారా అని అన్నాడు.
అర్జున్ తర్వాత మా ఇంటికి వచ్చి మాట్లాడారని. సినిమా చేయనందుకు తీసుకున్న అమౌంట్ కి డబుల్ తిరిగి ఇచ్చానని అన్నారు విశ్వక్ సేన్. తానేమి దొంగని కాదని ఆ ఇష్యూపై ఘాటుగానే స్పందించారు విశ్వక్ సేన్. ప్రస్తుతం గామితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విశ్వక్ సేన్ ఇదొక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పుకొచ్చారు.
దీనితో పాటుగా విశ్వక్ సేన్ చైతన్య కృష్ణ డైరెక్షన్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా చేశారు. ఆ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఆ సినిమాపై విశ్వక్ సేన్ ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు.
Also Read : Keerty Suresh : కీర్తి సురేష్ కూడా వాటికి రెడీ.. డిమాండ్ పెరగాలంటే డోస్ పెంచాలని ఫిక్స్ అయిన అమ్మడు..!